గుంటూరుకారం సినిమా 11 రోజుల కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'గుంటూరు కారం'. ఈ కమర్షియల్ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని ఇచ్చాడు.



మాస్ అండ్ ఎమోషనల్ స్టోరీతో రూపొందిన 'గుంటూరు కారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 134 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 108.38 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 24.62 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ చేరుతుంది.

కామెంట్‌లు