మహాభారతం పార్ట్ 4
పాండు రాజు అడవిలో ఒక సుందరమైన ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకొని తన భార్యలతో ఆనందంగా నివసించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉండే గిరిజనులు అందరు వీరిని దేవుళ్ళని చూసినట్టు చూసేవారు. ఒకరోజు కుంతి, మాద్రి పాండురాజు వద్దకు వచ్చి మీరు విలువిద్యలో అత్యంత ప్రావీణ్యుడు అని వాళ్లు వీళ్లు చెప్తుంటే వినడమే గాని ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు మేము మీతో వేటకు వచ్చి మీ విలువిద్యను చూస్తాము అని అడిగారు. సరే అని పాండురాజు తనతో పాటు వాళ్ళని వేటకు తీసుకెళ్లాడు.
నేను కళ్లు మూసుకొని కేవలం శబ్దం ఆధారంగా బాణం వేయగలను చూడండి అని అడవిలో ఒక పొదల దగ్గర శబ్దం వస్తే ఆ శబ్దం వస్తున్న దగ్గర బాణం వదిలాడు. వెంటనే ఎవరో మనిషి అరిచిన శబ్దం వినిపించింది. ఎవరా అని చూస్తే ఇద్దరు గంధర్వులు, వాళ్లకు సరదాగా జింక రూపంలో రమించాలని కోరిక పుట్టి జింకలుగా మారి ఆపొదల్లో రమిస్తున్నారు. ఈ విషయం గమనించని పాండురాజు వారి మీద బాణం వేశాడు. అప్పుడు వారిలో గంధర్వ స్త్రీ మరణించింది. అప్పుడు మిగిలిన గంధర్వుడికి కోపం వచ్చి, మృగాలు కూడా రమిస్తున్నప్పుడు దాడి చేయవు, వేటగాళ్లు వేటాడారు. అలాంటిది చూడడానికి నువ్వు రాజులా ఉన్నావు నియమం తప్పి రమిస్తున్న మాపై బాణం వేశావు. నా భార్య చనిపోవడానికి కారణం అయ్యావు. ఈరోజు నేను నిన్ను శపిస్తున్నాను ఏ రోజైతే నువ్వు ఏ స్త్రీతో నైనా సరే రమిస్తే ఆరోజే నువ్వు మరణిస్తావు అని శపించి వెళ్ళిపోయాడు గంధర్వుడు.
ఇక పాండురాజుకి ఇకపై నేను తండ్రిని కాలేనని అర్థం అయింది. ఇక తను సన్యాసం తీసుకుని ఈ అడవిలోనే ఉంటాను, హస్తినాపురానికి రాను అని కబురు పెట్టాడు. ఈ వార్త విన్న ధృతరాష్ట్రుడి ఆనందానికి అవధుల్లేవు. సింహాసనం పూర్తిగా తన స్వంతం అయిందన్న సమయంలో గాంధారి గర్భవతి అయింది అని తెలుస్తుంది. ఆ కబురు పాండురాజుకి చెప్పమని ధృతరాష్ట్రుడు భటులను పంపించాడు. ఈ వార్త వినగానే ఇక పాండురాజుకి ఎక్కడ లేని దుఃఖం తన్నుకు వచ్చింది. గుడ్డివాడైన నా అన్నకి సింహాసనం దక్కింది, ఇప్పుడు అన్న పిల్లలకే సింహాసనం దక్కుతుంది. నాకు కానీ నా వంశానికి కానీ రాజయ్యే యోగం లేదా... ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలని అనుకొని కుంతి, మాద్రి లను పిలిచి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, ఏం చేసైనా ఎవరితో సంగమించి అయినా నాకు మాత్రం పిల్లల్ని కనిపెట్టాలని వాళ్ళని అడిగాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. భర్త బాధని చూడలేక ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు.
కుంతీదేవి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన సంఘటన ఒకటి గుర్తుకొచ్చి ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలు పెట్టింది. తనకు గుర్తొచ్చిన ఆ సంఘటన ఏమిటంటే కుంతి యవ్వన వయసులో ఉన్నప్పుడు తను ఉండే ఆశ్రమానికి దుర్వాస మహర్షి అనే ఒక మహర్షి వచ్చాడు. అతను అంటే అందరికీ చచ్చేంత భయం. ఎందుకంటే ఆయన ముక్కోపి, చిన్న పొరపాటు జరిగినా, అయినదానికి, కానిదానికి శపిస్తుంటాడు. అందుకని ఆయనంటే భయపడి సేవలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ కుంతీ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు ఎంతో ప్రేమతో కన్నతల్లిలా, కన్నకూతురిలా చూసుకుంటుంది.
ఆమె సేవలకు మెచ్చుకొని దుర్వాస మహర్షి ఆశ్రమం నుండి వెళ్లేటప్పుడు కుంతి చెవిలో ఒక మంత్రం చెప్పి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది, ఈ మంత్రాన్ని నువ్వు ఐదుసార్లు ఉపయోగించుకోవచ్చు. ఈ మంత్రం ఉచ్చరించి నువ్వు ఏ దేవుడుని పిలిచినా ఆ దేవుడు నీ వాడవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ఆ మంత్రమే భూమి మీదకు దేవుళ్ళని దింపేలా చేసింది. ఆ మంత్రం ఏంటో దాని ఉపయోగం ఏంటో యవ్వన వయసులో ఉన్న కుంతికి అర్థం కాలేదు.
మరుసటి రోజు ఒక నదిలో స్నానం చేస్తూ దేవుడు నా వాడు అవడమేంటి... దాని అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఒకసారి ప్రయత్నిస్తే తెలుస్తుంది కదా అని నది ఒడ్డుకు వచ్చి ఏ దేవున్ని పిలుద్దామని ఆకాశం వైపు చూస్తే ఎదురుగా సూర్యుడు కనిపించాడు. సరే అని సూర్యభగవానున్ని తలచుకొని ఆయనకు దండం పెట్టి తను కళ్ళు మూసుకొని మంత్రం ఉచ్చరించింది కళ్ళు తెరిస్తే ఎదురుగా అత్యంత కాంతివంతమైన సూర్యభగవానుడు నిలుచుని ఉన్నాడు. సూర్య కిరణాలు ఆమె చుట్టూ అలుముకున్నాయి. ఆ కాంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు. కొంతసేపు ఏమీ కనిపించక ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కొంత సమయం తరువాత ఆ కాంతి ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఎదురుగా సూర్యభగవానుడు లేడు ఒక పసిబిడ్డ నవ్వు వినిపించింది. ఏమిటని తలంచి చూస్తే ఆమె చేతిలో అప్పుడే పుట్టిన పసి బిడ్డ ఉన్నాడు. బంగారపు రంగు చర్మంతో సహజంగా ఏర్పడిన స్పటికం లాంటి కవచకుండలాలతో సూర్యుడిని మించిన కాంతివంతమైన అందంతో సూర్యుడుని సైతం చల్లబరిచేంత స్వచ్ఛమైన నవ్వుతో అత్యంత సుందరమైన మగబిడ్డ ఆమె చేతిలో ఉన్నాడు. అంటే ఈ బిడ్డ నాకు సూర్యుడికి పుట్టిన బిడ్డా... దేవుడు నావాడవడం అంటే అర్థం ఇదేనా... సాక్షాత్తు దేవుడి బిడ్డలు నాకు పుడతారా అని అప్పుడు కుంతీకి అర్థం అయింది. ఆ బిడ్డ నవవ్వు చూశాక నా జీవితంలో ఇంతకన్నా ఆనందమైన, అద్భుతమైన రోజు ఉండదు, ఇక రాదు అనుకొంది. ఈ బిడ్డ నా బిడ్డ అని మురిసిపోయింది.
కానీ అదే రోజు ఆమె జీవితంలో మరిచిపోలేని విషాదకర రోజు కూడా అయింది. నాకు పెళ్లి కాకుండా, ఈ బిడ్డకు కారణమైనవాడు నా పక్కన లేకుండా, తండ్రి లేని బిడ్డతో ఈ సమాజం నన్ను ఒప్పుకోదు. ఈ బిడ్డను నాతో ఉంచుకోలేను. అలా అని వదిలేయలేను. ఏం చేయాలో అర్థం కాక నిర్ణయం తీసుకునే ధైర్యం లేక, తనకు అండగా నిలిచే తోడు లేక తనని అర్థం చేసుకోలేని, చేరదీయలేని సమాజాన్ని ఎదుర్కోలేక చివరిసారిగా తన బిడ్డను తనివితీరా చూసుకుని తన ఆశీస్సులను తన బిడ్డ పై ఉంచి ఒక బుట్టలో ఆ బిడ్డను పెట్టి నదిలో ఆ బిడ్డను వదిలి, సూర్య భగవానా, నా ప్రమేయం లేకుండా నాకు ఈ బిడ్డను ఇచ్చావు, కానీ నాతో పెంచుకునే ధైర్యం లేక నదిలో వదిలేసాను. ఈ బిడ్డకు నువ్వే దిక్కుగా ఉండాలి అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కుంతి ఆరోజు నదిలో వదిలేసిన ఆ బిడ్డ ఎవరో కాదు కర్ణుడు.
ఆరోజు ని గుర్తు చేసుకుని కుంతి చాలా బాధపడింది. దుర్వాస మహర్షి తనకిచ్చిన వరాల గురించి పాండురాజుకు చెప్పాల్సిన సమయం వచ్చిందని పాండురాజు దగ్గరికి వెళ్లి కర్ణుడు తనకు పుట్టాడని చెప్పకుండా, దుర్వాస మహర్షి తనకు ఇచ్చిన మంత్ర శక్తి గురించి చెప్పింది. ఇక పాండురాజు ఆనందానికి అవధుల్లేవు. అక్కడ రాజ్యంలో గాంధారి గర్భవతి అయింది. కానీ కుంతి కోరుకుంటే ఈ క్షణంలోనే పిల్లలు పుడతారు. కాబట్టి మన వంశంలో మొదటి బిడ్డ నాకే పుడితే వాడే రాజవుతాడు. అప్పుడు పాండురాజు కుంతితో మన బిడ్డ రాజు అవుతాడు కాబట్టి రాజుకి ఉండాల్సిన మొదటి లక్షణం ధర్మంగా జీవించడం. ముల్లోకాల్లో అత్యంత ధర్మవంతుడు యమధర్మరాజు.
యమధర్మరాజుకి స్వా, పర భేదాలుండవు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే న్యాయం. కాబట్టి ఆయననే పిలువు అని పాండురాజు కుంతితో అన్నాడు. సరే అని ఆ రోజు సాయంత్రం పూట కుంతీదేవి ఆ మంత్రం ఉచ్చరించి యమధర్మరాజుని తలచుకుంటే వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ చీకటి అలుముకుంది. కాసేపటి తర్వాత తన చేతిలో ఒక బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డనే ధర్మరాజు. కురువంశానికి కొత్త రాజు పుట్టాడని హస్తినాపురానికి పాండురాజు కబురు పంపించాడు. ఆ వార్త విని గాంధారి, ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోయారు.
ముందుగా నేను గర్భవతిని అయ్యాను నా కడుపున ముందుగా బిడ్డ పుట్టాలి కానీ కుంతీదేవికి ముందు బిడ్డ పుట్టాడు అని బాధపడింది గాంధారి. గాంధారి గర్భవతి అయి 12 నెలలు అయినా ఇంకా కాన్పు అవ్వలేదు. గాంధారి ఆ బాధ తట్టుకోలేక తన కడుపుని నొక్కి నొక్కి కాన్పు అయ్యేలా చేసింది. కానీ తనకు పుట్టింది బిడ్డ కాదు ఒక ఉక్కు పిండం. ఏంటీ పిండం పుట్టింది అని వ్యాసుడికి కబురు పంపారు. వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని గంగాజలంతో కడుగగా ఆ పిండం 101 ముక్కలుగా విడిపోయింది. వ్యాసుడు 101 కుండలను సిద్ధం చేసి ఒక్కో ముక్కని ఒక్కో కుండలో పెట్టి గాంధారిని పిలిచి అమ్మ నీకు గనుక సరైన కాన్పు అయి ఉంటే వంద మందికి సమానమైన కొడుకు పుట్టేవాడు. కానీ ఇప్పుడు అదే శక్తి 101 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు 101 మంది పిల్లలు ఆ కుండలలో తయారవుతారు అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు.
మూడవ రోజున ఆకాశం మొత్తం ఉరమడం మొదలైంది, ప్రళయం ఏదైనా సంభవిస్తుందా అని అనిపించేంతగా వర్షం వస్తుంది. ఏమిటి ఈ వింత ఏం జరగబోతుంది అని అందరూ అనుకుంటుండగా ఆ 101 కుండలలో ఒక కుండ పగిలి ఒక పసివాడి ఏడుపు వినిపించింది. ఆ బిడ్డ పేరు దుర్యోధనుడు. దుర్యోధనుడు పుట్టిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. అక్కడి ఆస్థాన జ్యోతిష్యులు గాంధారి, ధృతరాష్ట్రుల దగ్గరకు వచ్చి రాజ్యం లో జరుగుతున్న విపత్తులకు కారణం దుర్యోధనుడు, అతను నష్ట జాతకంలో పుట్టాడు. అతను ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు సంతోషంగా ఉండరు. తన వల్ల మన వంశం, రాజ్యం పతనం అయ్యే అవకాశం ఉంది. అందుకని అతన్ని బ్రతకనివ్వద్దు అని సలహా ఇచ్చారు.
దానితో ధృతరాష్ట్రునికి చాలా కోపం వచ్చింది. పిల్లలు కావాలని పరితపిస్తున్న సమయంలో మాకు పుట్టిన మొదటి వాడు దుర్యోధనుడు. అతనంటే మాకు అత్యంత ప్రేమ, వాత్సల్యం. ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడు మాతోనే ఉంటాడు. పెరిగి కురువంశానికి రాజవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు గాంధారి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ నేను ఆవేశపడి నా గర్భం మీద కొట్టుకొని బలవంతంగా కనడం వల్లే ఇదంతా జరిగింది. నా బిడ్డ రాక్షస గడియల్లో పుట్టేలా చేసింది అని భోరున ఏడ్చింది. దుర్యోధనుడు పుట్టిన కొన్ని రోజులకే మిగిలిన 100 కుండలు పగిలి 99 మంది మగ పిల్లలు మరియు దుశ్చల అనే ఒక ఆడపిల్ల పుట్టారు. అనగా దుర్యోధనుడు, దుశ్చలతో కలిపి మొత్తం 101 మంది గాంధారికి పుట్టారు. నాకు వంద మంది మగ సంతానం పుట్టారని పాండురాజుకి వర్తమానం పంపమని ధృతరాష్ట్రుడు అన్నాడు.
ఈ వార్త వినగానే పాండురాజుకి భయం మొదలైంది. నాకు ధర్మరాజు ఒక్కడే కుమారుడు కానీ నా అన్నకు 100 మంది కుమారులు పుట్టారరు. భవిష్యత్తులో నా ధర్మరాజు ఒక్కడే వారందరినీ ఎదిరించలేడు కాబట్టి నాకు ఆ వంద మందిని ఎదిరించగల కుమారుడు కావాలని అనుకున్నాడు. వెంటనే పాండురాజు కుంతీదేవి దగ్గరికి వెళ్లి విషయం వివరించి 100 మంది కౌరవులను ఎదిరించగల శక్తి గల కుమారుడు కావాలి అని అంటే అంతటి శక్తివంతమైన దేవున్ని పిలవాలి అనుకున్నప్పుడు వాళ్లకి ఒక శక్తివంతమైన దేవుడు గుర్తుకు వచ్చాడు. అతడే వాయుదేవుడు. ఎందుకంటే గాలి కంటే శక్తివంతమైంది ఈ లోకంలో ఏదీ లేదు.
కుంతీదేవి మంత్రాన్ని ఉచ్చరించి వాయుదేవున్ని పిలిచింది. వెంటనే ఆ ప్రాంతమంతా ఒక పెద్ద గాలి వీచి కుంతీదేవి చుట్టూ ఒక సుడిగుండం ఏర్పడి కుంతీదేవిని గాల్లోకి లేపి ఆకాశంలోకి తీసుకెళ్ళింది. కుంతీదేవి మేఘాలను దాటుకొని ఆకాశం అంచుల వరకూ వెళ్ళింది. అక్కడినుండి కిందికి చూసిన కుంతీదేవికి భూమి గుండ్రంగా ఉందని మొదటిసారి తెలిసింది. ఆ సుడిగుండం కుంతీదేవిని మళ్లీ నేల పైకి తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు కుంతీ తన చేతుల్లో చూస్తే ఎంతో బలవంతమైన, శక్తివంతమైన బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ బరువు ఆమె మోయలేక చేతుల నుండి జారీ కిందపడిపోయాడు. బిడ్డకు ఏమైనా అయిందా అని కంగారు పడి చూస్తే బిడ్డ నవ్వుతూనే ఉన్నాడు, కానీ తను పడ్డ బండ మాత్రం ముక్కలైపోయింది. తన బిడ్డ బలానికి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఆ బిడ్డకు భీముడు అని పేరు పెట్టాడు.
పాండురాజుకి మరొక ఆలోచన వచ్చింది, నాకు ముందుగా ధర్మాన్ని పాటించే కొడుకు ధర్మరాజు ఉన్నాడు, 100 మందిని ఎదిరించే శక్తి గల భీముడు పుట్టాడు. కానీ ధర్మం, బలం ఒకే వ్యక్తిలో ఉంటే అతడు అత్యంత వీరుడు అవుతాడు. అలాంటి కుమారుడు కావాలని అనుకొని దానికోసం ఇంద్రున్ని పిలవమని పాండురాజు కుంతిని అడిగాడు. కుంతీదేవి మంత్రం జపించి ఇంద్రున్ని పిలిచింది. ఆమె చేతిలో ఒక మగబిడ్డ ప్రత్యక్షమయ్యాడు. పాండురాజు ఆ బిడ్డ మొహాన్ని చూశాడు, ఆ బిడ్డ మొహంలో ఏదో తెలియని తేజస్సు కనిపించింది. ఈ బిడ్డ చరిత్రలో చూడని, భవిష్యత్ లో చూడలేని వీరుడు అవుతాడు అని కుంతితో అన్నాడు. ఆ బిడ్డకు అర్జున అని పేరు పెట్టారు.
ఇక పాండురాజు ఆనందానికి అవధుల్లేవు. దేవుడితో సమానమైన కుమారులు నాకు ఉన్నారు అనుకొని రోజూ అడవిలోనే వారితో ఆడుకుంటూ వారితో సంతోషంగా ఉండేవారు. పాండురాజు, కుంతి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు అంతా సంతోషంగా ఉన్నారు. కానీ పాండురాజు యొక్క రెండో భార్య మాద్రి మాత్రం సంతోషం లేదు. పిల్లలు లేరని మాద్రి బాధపడుతుందని పాండురాజు అర్ధం చేసుకున్నాడు. కుంతీదేవి దగ్గర ఉన్న మంత్రం ఒకటి మాద్రికి ఇవ్వమని అని అడిగాడు. సరే అని కుంతి ఒక మంత్రం మాద్రికి ఇచ్చింది. మాద్రి అశ్విని కుమారులు అనే ఇద్దరు కవల దేవుళ్ళని పిలిచింది. ఎందుకనగా తన సవితి అయినటువంటి కుంతీదేవికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరైన ఉండాలి అని వారిని పిలిచింది. మాద్రికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారికి నకుల, సహదేవ అని పేర్లు పెట్టారు.
తరువాత 15 సంవత్సరాలు గడిచింది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు అడవిలోని గిరిజనుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటూ పెరిగారు. నకుల సహదేవులు అమ్మల ఒడిలో ఆడుకుంటూ ఉండేవారు. అందరూ సంతోషంగా ఉన్నారు. మరుసటిరోజు తపస్సు చేసుకోవడానికి నదీతీరానికి వెళ్ళిన పాండురాజుకి అప్పుడే అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న తన రెండో భార్య మాద్రి కనిపించింది. 15 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించిన పాండురాజు ఆ క్షణం తడిసిన వస్త్రాల్లో తన భార్య ని చూసి నిగ్రహం కోల్పోయాడు. తన శరీర వాంఛ తీర్చమని మాద్రిని అడిగాడు. అప్పుడు మాద్రి స్వామి మీకు శాపం ఉంది మీరు స్త్రీతో ఎప్పుడైతే శారీరకంగా కలుస్తారో అప్పుడే మీరు మరణిస్తారు అని మరిచారా అని అడిగింది. అప్పుడు పాండురాజు నాకు ఏమైనా సరే ఈరోజు నా కోరిక తీర్చాల్సిందేనని బలవంతం చేశాడు. మాద్రి ఆయనను ఎన్నో రకాలుగా ఆపాలని ప్రయత్నించింది కానీ ఆపలేకపోయింది.
సాయంత్రం అయింది, కుంతి తన పిల్లలతో ఇంటికి వచ్చింది. చాప పైన చావుబ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ పాండురాజు కనిపించాడు. ప్రక్కనే మాద్రి కూర్చొని బోరున ఏడుస్తుంది. విషయం ఏమై ఉంటుందో కుంతికి అర్థమయింది. ఆమెకి ఇక బాధపడటం తప్ప ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాండురాజు తన కుమారులను దగ్గరికి పిలిచి నా శరీరం వ్యాసుడి వల్ల పుట్టింది పుట్టింది, వ్యాసుడికి ఉండే జ్ఞానం, శక్తి నాకూ ఉన్నాయి. నేను చనిపోయాక మీ ఐదుగురు నా ఒంట్లోని ఒక చిన్న మాంసం అయినా మీరు తినండి, అప్పుడు మీకు లేని కొత్త శక్తులు వస్తాయి అని అన్నాడు. అలా చేయడం మా వల్ల కాదని ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఏడ్చుకుంటూ పర్ణశాల బయటకి వెళ్ళిపోయారు.
ఆ సమయంలో కొన్ని చీమలు పాండురాజు శరీరం మీద నుంచి వెళుతూ తన శరీరంలోని ఎంతోకొంత పాండురాజు మాంసాన్ని అవి తింటున్నాయి. నకుల సహదేవులు చెరొక చీమను పట్టుకొని తిన్నారు, వెంటనే వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమి కనిపించట్లేదు, వారికి ఏవో పెద్ద శబ్ధాలు, గుర్రాల అరుపులు, కత్తుల శబ్ధాలూ వినిపించాయి. వారి కళ్ల ముందు ఒక పెద్ద యుద్ధ సన్నివేశం కనిపించింది అదే కురుక్షేత్రం. అది ఎందుకు జరిగిందో దానికి సంబంధించిన మొత్తం వివరాలు వాళ్లకి కళ్లకి కట్టినట్లు కనిపించింది. వాళ్లకి భయం మొదలైంది ఈ విషయం వెంటనే వాళ్ల అన్నలకు చెప్పి ఆ యుద్ధం జరగకుండా ఆపాలి అని కంగారుగా పర్ణశాల బయటికి వచ్చారు.
బయట వచ్చి చూస్తే ఒక వృద్దుడు వారికి కనిపించాడు. ఆ వృద్ద వ్యక్తి ఎంతో తేజోవంతంగా ఉన్నాడు. ఆగండి ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నారని ఆ వృద్దుడు నకుల సహదేవులను అడిగాడు. కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది దాని గురించి మా అన్నలకు చెప్పడానికి వెళ్తున్నాము అని అన్నారు. మీ అన్నలకి ఈ విషయం చెప్పే ముందు మీరు తప్పు చేస్తున్నారు అని తెలుసుకోండి. మీరు తప్పు చేస్తున్నారు అని నేను నిరూపిస్తాను, అలా నిరూపిస్తే మీరు నేను చెప్పినట్లు వినాలని అన్నాడు. ఒకవేళ నేను నిరూపించ లేకపోతే అప్పుడు మీరు అనుకున్నట్టు ఈ విషయం మీ అన్నలకు చెప్పుకోండి అని ఆ వృద్దుడు అన్నాడు. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు.
అప్పుడు ఆ వృద్ద వ్యక్తి మీకు తెలిసింది ఏమిటి అని అడిగాడు. భవిష్యత్తులో జరగబోయేది అని నకుల సహదేవులు అన్నారు. సరే మీ అన్నలకు చెప్తే ఏం జరుగుతుంది అని ఆ వ్యక్తి అన్నాడు. జరిగేది జరగకుండా ఆపుతారు అని అన్నారు. అంటే జరగబోయేది చెప్పి మీరు దానిని జరగకుండా ఆపుతారు, జరగాల్సింది జరగకుండా మీరు ఆపితే అదే జరుగుతుందని ఎలా మీరు మీ అన్నలకు చెబుతారు, పైగా జరగాల్సిందానికన్నా ప్రమాదకరమైంది ఏదైనా జరగవచ్చు అని ఆ వృద్ద వ్యక్తి అన్నాడు. ఇక వాళ్లు కన్ఫ్యూషన్ లో పడ్డారు. వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్లు రియలైజ్ అయ్యారు. అప్పుడు ఆ వృద్దుడు నేనే గెలిచాను కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అని నకుల నువ్వు భవిష్యత్తులో జరిగేది ఏదైనా ఎవరికైనా నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తే నీ తల వెయ్యి ముక్కలై నువ్వు మరణిస్తావు. సహదేవ ఈ రోజునుండి నీ భవిష్యత్తు నీకు ఒక కల లాగా అనిపిస్తుంది. భవిష్యత్తును కళ అని అనుకున్నావు కాబట్టి అది అంత ముఖ్యమైనది కాదని అనుకొని నువ్వు వేరొకరికి అది చెప్పవు అని అన్నాడు.
గుమ్మం దగ్గర జరుగుతున్న ఈ విషయం అంతా లోపల నుండి పాండురాజు చూస్తున్నాడు. స్వామీ ఒకసారి ఇలా రండి అని పాండురాజు ఆ వృద్దుడిని పిలిచాడు. మీరు వృద్ధులు మీ కన్నా ముందుగా నా కుమారులు మరణిస్తే వారి చితిని మీ కడుపు పైన పెట్టి కాల్చాలి అని మాట అడిగాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే ఆ వృద్ద వ్యక్తి కన్నా ముందుగా పాండురాజు కుమారులు మరణిస్తే ఆ వృద్ద వ్యక్తి కూడా వారితో పాటు చనిపోవాలి. ఆ వ్యక్తి బ్రతకాలి అంటే కచ్చితంగా పాండురాజు పిల్లలు కూడా బ్రతకాలి. సరే అని మాట ఇచ్చి ఆ వృద్దుడు వెళుతుండగా పాండురాజు గట్టిగా నాకు మాట ఇచ్చావు మాట తప్పవుగా కృష్ణా అని అన్నాడు. ఆ వృద్దుడు వెనుకకు తిరిగి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు శ్రీకృష్ణ వసుదేవ్ యాదవ్. శ్రీ కృష్ణుడే ఆ వృద్దుడి రూపంలో వచ్చాడు.
ఇక పాండవులను రక్షించాల్సిన బాధ్యత శ్రీకృష్ణుడిదే. పాండు రాజు మరణించాడు, పాండురాజును దహనం చేస్తున్నప్పుడు నీ పిల్లలతో సమానంగా నకుల సహదేవులను చూసుకోమనీ, మన భర్త మరణానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేనే కారణం, నాకు ఇంకా బ్రతికే అర్హత లేదు అని మాద్రి కుంతితో చెప్పి పాండురాజును కాల్చడానికి ఏర్పాటుచేసిన చితిలో దూకి భర్తతో పాటు మాద్రి కూడా కాలి బూడిదయింది. కుంతీదేవికి పాండురాజు పిల్లలైన పంచపాండవులు, పాండవులకు తమ తల్లి అయిన కుంతీదేవి ప్రపంచం అయిపోయింది. అడవిలో ఆ పర్ణశాలలో పాండవులతో జీవిస్తున్నప్పుడు ఎటువైపు చూసినా కుంతీకి ఆమె భర్త నివసించిన ప్రదేశం గుర్తుకు వచ్చి రోజు బాధపడుతుంది.
ఇక ఈ పర్ణశాలలో ఉండకూడదు, రాజుల్లాగా బ్రతకాల్సిన నా పిల్లలు ఇలా అడవులలోనే జీవించడం నాకు ఇష్టం లేదు, వాళ్లకు హక్కు అయిన రాజ సింహాసనం వారికి చెందేలా చూడాల్సిన బాధ్యత నాదే అనుకొని ఇక హస్తినాపురానికి వెళ్లాలని నిర్ణయించుకుంది కుంతీదేవి.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో చెబుతాను.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com
డియర్ ఫ్రెండ్స్ దయచేసి Subscribe మీద క్లిక్ చేసి Subscribe చేసుకోండి. మీరు Subscribe చేసుకుంటే నేను ఆర్టికల్ పోస్ట్ చేయగానే మీకు Notification వస్తుంది.