గుంటూరుకారం మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సలార్ మూవీలాగే గుంటూరు కారం కూడా 28 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరుకారం సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీని కోసం సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్రతినిథుల మధ్య భారీ ఒప్పందం జరిగిందని సమాచారం. ఫిబ్రవరి రెండోవారంలోనే గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అయితే ఫిబ్రవరి 9న లేదా 10వ తేదీల్లో గుంటూరుకారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వొచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి