పాండవులను చంపడానికి దుర్యోధనుడు వేసిన ప్లాన్

‌మహాభారతం పార్ట్ 11

కుంతీతో సహా పాండవులు వారణాసికి బయలుదేరారు. వీరు వెళ్లేలోగా పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుడు వీరికోసం ఒక అందమైన గృహాన్ని నిర్మించాడు. పాండవులు ఆ ఇంటిలోకి చేరారు. పురోచనుడు పాండవులకు సేవ చేయడానికి ఒక బోయ వనితను కూడా నియమించాడు. బోయ వనితకు ఐదుగురు కొడుకులు. వీరు కూడా పాండవలతో పాటే అదే గృహంలో ఉండేవారు. ధర్మరాజుకు ఆ ఇంటిలోకి వెళ్లగానే కమ్మగా ఏదో వింతైన వాసన వచ్చింది. వెంటనే భీముడిని పిలిచి భీమ ఈ ఇంటి గోడల నుండి ఏదో వింతైన వాసన వస్తుంది చూడు అని అన్నాడు ధర్మరాజు.



భీముడు ఆ వాసన చూసి అన్నా ఇది ఖచ్చితంగా నెయ్యి, కర్పూరం వాసన అని చెప్పాడు. అర్జునుడు వచ్చి ఇంటి గోడ నుండి ఒక చెక్క ముక్క తీసి చూసాడు. అపుడు తెలిసింది అది చెక్క కాదు లక్క అని. ఆ ఇంటిని నిర్మించిన వారు లక్క,నెయ్యి మరియు కర్పూరం తో నిర్మించి వీటి వాసన రాకుండా దానిని ఇతర సుగంద ద్రవ్యాల తో కవర్ చేసారు. లక్క పెట్రోల్ లాగా తొందర మంటలు మండే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇళ్లు తొందరగా కాలిపోయేలా చేస్తుంది లక్క. తొందరగా కాలిపోవాలని ఆ ఇంటిని లక్క, నెయ్యి మరియు కర్పపూరంతో నిర్మించాడు పురోచనుడు. ఇదంతా పాండవులను చంపడానికి చేసిన పన్నాగం.

పురోచనుడికి పాండవులను చంపే అవసరం ఏమి లేదు. కానీ పాండవులను లేకుండా చేస్తే పురోచనుడికి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఇస్తానని దుర్యోధనుడు పురోచనుడితో డీల్ మాట్లాడుకున్నాడు. అందుకే పురోచనుడు ఆ ఇంటిని లక్కతో నిర్మించాడు. బోయ వనితను నియమించింది కూడా పాండవుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికే. ఇంటిని లక్కతో నిర్మించారని తెలియగానే పాండవులకు విషయం అర్థమైపోయింది. ఇక్కడికి బయలుదేరే ముందు విదురుడు ఆ విధంగా ఎందుకు చెప్పాడో పాండవులకు ఇపుడు అర్థమయింది.


అపుడు పాండవులు ఒక వ్యక్తితో ఎవరికీ తెలియకుండా ఆ ఇంటి నుండి బయటకి(అడవిలోకి) సొరంగం తవ్వించారు. కృష్ణచతుర్థశి రోజు మహాశివోత్సవం సందర్భంగా కుంతీదేవి చుట్టుపక్కల స్త్రీలందరికీ వాయినాలు ఇచ్చి సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఆరోజు రాత్రి బోయ వనిత కుమారులతో సహా బాగా ఆటపాటలలో మునిగి మధ్యం సేవించి సృహలేకుండా పడిపోయారు. రాత్రి అయింది అందరూ నిద్రపోతున్నారు. మద్య రాత్రి ఒక చినుకు అర్జునుడి చెంప మీద పడి కొంచం కాలినట్టయింది. లేచి చూస్తే ఇంటి చుట్టూ అన్ని వైపులా నిప్పంటుకుని కాలిపోతుంది. వెంటనే పాండవులు రహస్య సొరంగంలోకి వెళ్లిపోయారు. కానీ లక్క కాలడం వల్ల వచ్చిన పొగకి అందరూ సృహతప్పి పడిపోయారు ఒక్క భీముడు తప్ప. బోయవనిత మరియు తన కుమారులు సృహలో లేనందున మంటలో కాలిపోయారు.



భీముడు కుంతీని తల మీద ఎత్తుకుని, నకులసహదేవులను చంకలో పెట్టుకొని అర్జునుడు, ధర్మరాజులను భుజం మీద ఎత్తుకొని పరుగెత్తుకుంటూ సొరంగ మార్గం ద్వారా అడవిలోకి వచ్చాడు. అడవిలో ఒక చెట్టు కింద అందరినీ పడుకోబెట్టి కాపలాగా ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక అందమైన స్త్రీ వచ్చి భీముడిని చూసి ఓ వీర నీ అందాన్ని చూసి నేను మైమరచిపోయాను. నన్ను పెళ్లిచేసుకో అని అడిగింది. కానీ భీముడు అందుకు ఒప్పుకోలేదు. సరే నువ్వు నన్ను పెళ్లిచేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మీకు మంచిది కాదు. ఇక్కడ హిడంబాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. మిమ్మల్ని చూసాడంటే మీ ప్రాణాలకే ముప్పు అని ఆ స్త్రీ భీముడితో చెప్పింది. అపుడు భీముడు అసలే ఆవేశంలో ఉన్నాను ఎవడస్తాడో రమ్మను వాడి సరదా తీర్చేస్తా అని అన్నాడు.

అంతలో అక్కడికి హిడంబాసురుడు రానే వచ్చాడు. భీముడిని చూసి అహా నాకు భలేగా దొరికావు అని భీముడిని మంచి ఆహారంగా భావించి భీముడి ముందుకు వెళ్లాడు. వారిద్దరి మధ్యా ద్వంద యుద్ధం మొదలైంది. వారి యుద్దం జరుగుతున్న శబ్ధానికి అందరూ(సృహ తప్పి ఉన్న అర్జునుడు, ధర్మరాజు,కుంతీ, నకులసహదేవులు)లేచారు. ఏం జరుగుతుందని కుంతీ పక్కనున్న స్త్రీని అడిగింది. ఏమీ లేదు అత్తమ్మ గారు మీ కొడుకు(భీముడు) హిడంబుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నాడు. నువ్వు ఎవరమ్మా నన్ను అత్తమ్మ అంటున్నావు అని కుంతీ ఆ స్త్రీని అడిగింది.


నా పేరు హిడంబి ఆ రాక్షసుడు మా అన్నయ్య, నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పింది. అపుడు కుంతీ కంగారు పడిపోయింది. మీరేమీ కంగారు పడకండి మీ కొడుకు మా అన్నయ్యను తట్టుకొని ఇంతసేపు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మీ కొడుకే గెలుస్తాడు అని హిరంబి కుంతీతో చెప్పింది. భీముడు హిడంబుడిని చంపేసాడు. నాకున్న ఒకే ఒక్క భందం మా అన్నయ్య ఆ బందం కాస్త నాకు లేకుండా చేసావు. నేను ఇపుడు ఒంటరి దాన్ని నన్ను పెళ్లిచేసుకోమని హిడంబి ఏడవసాగింది. కుంతీ కూడా అంగీకరించడంతో భీముడు హిడంబిని పెళ్లి చేసుకున్నాడు.


కానీ కుంతీ ఒక షరతు పెట్టింది. అదేంటంటే పగలంతా భీముడు నీతోనే ఉంటాడు కానీ రాత్రి అవగానే నా కొడుకుని నా దగ్గరకి పంపించాలి అని కుంతీ హిడంబితో చెప్పింది దానికి హిడంబి సరేనంది. కుంతీ ఆ షరతు పెట్టడానికి కారణం ఏంటంటే రాక్షసులకు రాత్రిపూట శక్తి ఎక్కువ ఉంటుంది. హిడంబి రాక్షస కన్య కాబట్టి కుంతీ ఆ షరతు పెట్టింది. అలాగే భీముడు కూడా ఒక షరతు పెట్టాడు. మనకు కొడుకు పుట్టేంత వరకే నేను నీతో కలిసి ఉంటాను. మనకు కొడుకు పుట్టాక నేను నిన్ను వదలేస్తాను అని భీముడు అన్నాడు. హిడంబి కూడా అందుకు ఒప్పుకుంది.

హిడంబి, భీముడికి పెళ్ళైంది. ఇపుడు ఏం చేద్దాం అన్నయ్య అని అర్జనుడు ధర్మరాజుతో అన్నాడు. కొంతకాలం మనం ఈ అడవిలోనే ఉందాం ఎందుకనగా మనపై హత్యాయత్నం జరిగింది. మనం బతికే ఉన్నామని తెలిస్తే ఈసారి డైరెక్ట్ గానే మన మీద దాడి చేస్తారు. ఇపుడు మనం ఒంటరి వారం. మనకు సైన్యం, బలం, బలగం ఏమీ లేవు. అవన్నీ సంపాదించుకున్నాకే మనం తిరిగి హస్తినాపురానికి వెళ్ళాలి అప్పటి వరకూ ఇక్కడే ఎవరికీ తెలియకుండా ఉందాము అని అన్నాడు. ఇక్కడ హస్తినాపురంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, విధురుడుతో పాటు ప్రజలంతా పాండవులు చనిపోయారని భాదపడుతున్నారు.

లక్క ఇంటిలో బోయ వనిత మరియు తన ఐదుగురు కుమారులు కాలి చనిపోయారు కదా వారి శరీరాలు గుర్తుపట్టకుండా కాలిపోవడంతో వారు కుంతీ మరియు పంచ పాండవులు అనుకొని ప్రజలు, భీష్ముడు తదితరులు భాదపడుతున్నారు. దుర్యోధనుడు ఇక నాకు ఉన్న అడ్డు తొలగిపోయింది. ఇక ఎప్పటికీ హస్తినాపురానికి నేనే రాజుని, నాకు ఇక తిరుగులేదు అని లోపల గర్వంగా సంతోషిస్తున్నాడు. దృతరాష్ట్రుడు కూడా లోపల ఆనందపడుతూ భయటకి భాదపడుతున్నట్టుగా నటిస్తున్నాడు.

రోజులు గడిచాయి హిడంబి, భీముడికి ఒక కుమారుడు జన్మించాడు అతడి పేరు ఘటోత్కచుడు. ఇక ఈ అడవి నుండి వెళ్లిపోదాం అని పాండవులు నిర్ణయించుకున్నారు. కుంతీతో సహా పాండవులు అడవి నుండి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. భీముడు హిడంబి, ఘటోత్కచుడుని వదిలి తన అన్నతమ్ముళ్లతో భయలు దేరాడు. ఒక ఊర్లో ఒక బ్రాహ్మనుడు వీరికి ఆశ్రయం ఇచ్చాడు. పాండవులు రోజు బ్రాహ్మనులలాగా మారువేశాల్లో భిక్షాటనకు వెళ్లేవారు. ఒకరోజు వీరికి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మనుడు ఒక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమైంది అని కుంతీ ఆ బ్రాహ్మనుడిని అడిగింది.

ఈ ఊరి చివర కొండ గుహలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ బకాసురుడు రోజు ఊరి మీద పడి దొరికిన వారినందరిని చంపి తినేవాడు. ఒకరోజు మా ఊరి జనమంతా ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి ఒక ఒప్పందం చేసుకున్నాము. ఆ ఒప్పందం ఏంటంటే నువ్వు రోజు ఇలా ఊరి మీద పడి మనుషుల్ని తింటుంటే కొన్ని రోజులకు ఊర్లో మనుషులే లేకుండా పోతారు. కాబట్టి మేము ప్రతి రోజు ఒక ఎడ్ల బండి నిండా భోజనం పెట్టి ఆ ఎడ్ల బండికి రెండు బలమైన దున్నపోతులను కట్టి పంపిస్తాము అని చెప్పాము. అపుడు ఆ రాక్షసుడు ఎడ్లబండితో పాటు ఒక మనిషిని కూడా పంపిస్తే మీరు చెప్పిన ఒప్పందానికి ఒప్పుకుంటాను అన్నాడు. సరే ఎడ్లబండితో పాటు ఒక మనిషిని కూడా పంపిస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాము.

అప్పటి నుండీ ఎడ్లబండి నిండా ఆహారంతో పాటు వారానికి ఒకరి ఇంటి నుంచి ఒక మనిషి వెళ్లాలి అని అనుకున్నాము. ఈ రోజు నా వంతు వచ్చింది. ఇవాల ఎడ్లబండితో పాటు నేనే వెళ్లాలి అందుకే ఏడుస్తున్నాను అని ఆ బ్రాహ్మనుడు కుంతీ తో అన్నాడు. అపుడు కుంతీ మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు. మీరేమీ భాదపడకండీ ఇవాళ మీ స్థానంలో ఎడ్లబండితో  నా కొడుకుని పంపిస్తాను అని కుంతీ చెప్పింది. అలా చేస్తే మీ కొడుకుని ఆ బకాసురుడు చంపి తినేస్తాడు అని బ్రాహ్మనుడు అన్నాడు. నా కొడుకు వాడికి ఆహారం అవడు వాడికే చావు రుచి చూపిస్తాడు అని కుంతీ అన్నది.

వెంటనే భీముడిని పిలిచి కుమారా నువ్వు ఈ ఎడ్లబండిని తీసుకొని ఈ ఊరి చివర ఉన్న కొండ గుహ దగ్గరికి వెళ్లు అని భీముడితో చెప్పింది. భీముడు ఎడ్లబండి తీసుకొని భయలుదేరాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com

డియర్ ఫ్రెండ్స్ ఆర్టికల్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే subscribe పైన క్లిిిక్ చేసి subscribe చేేసుకోగలరని మనవి.

కామెంట్‌లు