మహాభారతం పార్ట్ 8
ద్రోణాచార్యుడు కులం గురించి ప్రస్తావించి కర్ణుడిని అవమానిస్తుంటే సభలో అందరిముందు కర్ణుడు ఘోర అవమానపాలు కాకుండా కాపాడిన దుర్యోధనుడు ఆ సమయంలో కర్ణుడికి దేవుడిలా కనిపించాడు. దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చిన గౌరవంతో దుర్యోధనా నేను ఈరోజు అందరి సమక్షంలో నీకు మాట ఇస్తున్నాను, నా మనసు, నా శరీరం, నా జీవితం, నా చివరి శ్వాస వరకు నీకు మిత్రుడిగా, విధేయుడిగా, నమ్మిన భంటుగా, కర్ణుడూ, దుర్యోధనుడూ ఇద్దరూ ఒక్కరే అని ఈ లోకం అనుకునేంతగా, నీ ఆశయాలే నా ఆశయాలుగా, నీ సంకల్పమే నా సంకల్పముగా, నీకు ప్రతి చోటా విజయం కోసం నీకన్నా ముందు నేను ఉంటానని మాట ఇస్తున్నాను అని కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. దుర్యోధనుడు ఏది కోరి కర్ణుడికి రాజ్యమిచ్చాడో అది కర్ణుడి నోటి వెంట వచ్చేసరికి దుర్యోధనుడికి ఇక పట్టరాని సంతోషం కలిగింది. బటులతో అంతఃపురానికి కర్ణుడిని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయించాడు.
పుట్టగానే పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన కొడుకు పెరిగి, పరశురాముడి దగ్గర శిశ్యరికం చేసి, ఇంతటి వాడై వచ్చాడని సంతోషం, తన కొడుకు కల్లముందుకు వచ్చినా కూడా పెళ్ళి కాక ముందు పుట్టిన కొడుకు కనుక దగ్గరికి తీసుకోలేకపోతున్నానని భాద, సభలో అందరిముందు అవమానపాలు అవుతున్నాకూడా ఇతను నాకొడుకు అని చెప్పుకోలేని నిస్సాహయ స్థితిలో ఉన్నానని దుఖంః, అన్నధమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన కర్ణుడు, అర్జునుడు శత్రువులుగా మారడం, శత్రువు అయిన దుర్యోధనుడితో కర్ణుడు చేతులు కలపి వెళ్లాడన్న ఆవేదన, అన్నీ భావోధ్వేగాలు ఒకేసారి కుంతీకి కలిగాయి. అన్నింటిని దిగమింగుకొని దూరం నుండే కర్ణుడిని ఆశీర్వదించింది. చాలా సంవత్సరాల తర్వాత ఆరోజే దుర్యోధనుడు తన గదిలో గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. పక్క గదిలో ఉన్న కర్ణుడికి మాత్రం మదిలో మెదిలే ఆలోచనలతో నిద్రపట్టడం లేదు. ఏంటీ నా ఈ జీవితం అనుకుంటూ కర్ణుడు తన గతాన్ని గుర్తుచేసుకోవడం మొదలు పెట్టాడు...
తనకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత కర్ణుడు తన అమ్మ అయిన రాధమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ఎవరికీ లేనిది నా చెవులకు కుండలాలు, ఛాతికి కవచం ఎలా వచ్చాయి అని అడిగాడు. అపుడు రాధమ్మ కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఒక పెట్టెలో నదిలో కొట్టుకుంటూ వచ్చి నాకు దొరికావు. నిన్ను చూసిన ఆ క్షణాన నాకు పిల్లలు పుట్టట్లేదనె భాద మాయమయిపోయింది. నువ్వు నాకు దొరికిన రోజున నా సంతోషం చెప్పలేనిది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నేను నిన్ను ఎంతో ప్రేమతో పెంచాను. యశోధమ్మ కృష్ణుడిని ఎంత ప్రేమతో పెంచిందో నిన్ను నేను అలా పెంచాను. నిన్ను నా కడుపున కనకపోయిన నేనే నీ తల్లిని అని రాధమ్మ కర్ణుడితో చెప్పింది. కర్ణుడు పరశురాముడి దగ్గర శిశ్యరికం కోసం వెళ్తే నేను క్షత్రియులకు నేర్పను అని పరశురాముడు చెప్తే నేను శూద్రున్ని అని చెప్పి పరశురాముడి దగ్గర శిశ్యుడిగా చేరతాడు. పరశురాముడు కర్ణుడికి తన అస్త్ర విద్యలు నేర్పుతాడు.
ఒకరోజు పరశురాముడు అలసిపోయి ఒక చెట్టుకింద నిద్రపోతున్నాడు. అది చూసిన కర్ణుడు గురువుగారి తల కింద ఏమి లేకుండా పడుకోవడంతో కర్ణుడు పరశురాముడి తలని తన తొడమీద పెట్టుకొని పడుకోమన్నాడు. కొంత సేపటికి కర్ణుడి తొడ కింద ఒక కందిరీగ చేరి కర్ణుడి తొడను కొరకసాగింది. కానీ కర్ణుడు ఆ కందిరీగను ఏమి అనలేదు. ఎందుకనగా కదిలితే గురువుగారి నిద్రకు భంగం వాటిల్లుతుంది కాబట్టి. కాసేపటికి కందిరీగ కొరకడం వల్ల కర్ణుడి తొడనుండి రక్తం కారుతుంది. అలా కారుతున్న రక్తం నిద్రిస్తున్న పరశురాముడి భుజానికి తాకింది. దాంతో పరశురాముడు లేచి తన భుజానికి అంటిన రక్తాన్ని తాకి చూసాడు. వెంటనే పరశురాముడు ఒరేయ్ ద్రోహి శూద్రుడిని అని చెప్పి నన్నే మోసం చేస్తావా అన్నాడు. అపుడు కర్ణుడు లేదు గురువుగారు నేను శూద్రుడినే అని అంటాడు. నోరు ముయ్ భూగోళమంతా 21 సార్లు చుట్టి క్షత్రియులను వదించిన నాకు తెలియదా క్షత్రియుల రక్తం ఎలా ఉంటుందో.
నువ్వు క్షత్రియుడివే... శూద్రడిని అని అబద్దం చెప్పి నా దగ్గర విద్యలు నేర్చుకున్నావు. నన్ను మోసం చేసినందుకు జీవితంలో నీకు అత్యవసరమైన పరిస్థితిలో నీకు అస్త్రవిద్య అవసరమున్న సమయంలో నీకు ఉన్న విద్యలు పనిచేయవు అని శపిస్తున్నాను అని పరశురాముడు కర్ణుడిని శపించి అక్కడినుండి వెళ్ళిపోయయాడు. ఈ భూగోలంలో అర్జునుడిని ఓడించే వీరుడు ఒక్క కర్ణుడు మాత్రమే. ఈ విషయం ఇంద్రుడికి తెలుసు. అర్జునుడు ఇంద్రుడి వల్ల పుట్టాడు కనుక తన కొడుకుని ఓడించగల కర్ణుడి బలం ఇంకా పెరక్కూడదని ఇంద్రుడే కందిరీగ రూపంలో వచ్చి ఇలా చేసాడు. పరశురాముడు శపించిన విషయం కర్ణుడు తన తల్లి రాధమ్మతో చెపితే నువ్వు నిజంగానే క్షత్రియుడువేమో, నీ అసలు తల్లిదండ్రులు క్షత్రియులై ఉండొచ్చు అని రాధమ్మ చెప్పింది. అపుడు తన అసలు తల్లిదండ్రలు ఎవరో తెలుసుకుందామని కర్ణుడు బయలుదేరాడు. అలా ఎన్నో ప్రదేశాలు తిరిగాడు.
ఒకరోజు ఒక వీధిలో వెళుతుంటే ఒక ఇంటి ముందు ఒక ఆవు మేత మేస్తుంది. దానికి కొంత దూరం నుండి ఒక పులి ఆవు దగ్గరికి వేగంగా పరుగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన కర్ణుడు తన విల్లుతో ఆ పులికి బాణం వేసాడు. బాణం తగిలిన వెంటనే ఆ పులి ఆవుదూడగా మారిపోయి అరుస్తూ చనిపోయింది. ఆ అరుపు విని ఆవు కట్టేసి ఉన్న ఇంటి నుంచి ఒక వేద పండితుడు వచ్చి ఆవుదూడకు తగిలి ఉన్న బాణం చూసి, కర్ణుడి చేతిలో ఉన్న విల్లు చూసి ఏమయ్యా తల్లిపాల కోసం ఆవుదూడ తన తల్లి తగ్గరికి వస్తుంటే దాని మీద బాణం వేస్తావా అని కోపంగా వేద పండితుడు కర్ణుడితో అన్నాడు. అదికాదు అని కర్ణుడు అసలు విషయం చెప్పబోతుంటే ఇంకేమి మాట్లాడకు అని, ఒక దూడను తన తల్లి నుంచి దూరం చేశావు ఇందుకు నువ్వు చనిపోయే క్షణంలో నీకు నా అనుకునే వాళ్లెవరూ నీకు అందుబాటులో ఉండరు అని కర్ణుడిని శపిస్తాడు. ఆ పులి ఆవుదూడగా ఎందుకు మారిందో కర్ణుడికి అర్థంకాదు.
ఇంద్రుడే పులిరూపంలో వచ్చి కర్ణుడిని కన్ఫ్యూజ్ చేసాడు. అది అర్థంకాక కర్ణుడు ఆలోచించుకుంటూ ముందుకు వెళతాడు. కొంతదూరం వెళ్లాక ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. కర్ణుడు ఆ పాప దగ్గరికి వెళ్లి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, మా అమ్మ నెయ్యి తీసుకురమ్మని చెపితే తీసుకెళుతుండగా నా చేతిలోంచి నెయ్యి గిన్నె జారి కిందపడి నెయ్యంతా పోయింది, ఇపుడు నెయ్యిలేకుండా వెళితే మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పి ఏడుస్తుంది. నేను నీకు మరలా నెయ్యి ఇప్పిస్తాను ఏడవకు అని కర్ణుడు అన్నాడు. లేదు లేదు నాకు ఆ నెయ్యే కావాలని ఆ పాప మారం చేస్తుంది. దాంతో కర్ణుడు చేతితో నెయ్యి పడిన ప్రదేశంలో మట్టిని పెకిలించి మట్టిలోని నెయ్యిని గిన్నెలో పిండి పాపకి ఇచ్చి పంపిస్తాడు.
వెంటనే భూమిలో నుండి భూదేవి ప్రత్యక్షమై ఒక్కసారి నాలో కలిసిపోయింది నాకే సొంతం మరలా దానిని వెనక్కి తీసుకోవడం తప్పు అని నీకు తెలియదా...నువ్వు చేసిన తప్పుకి నీకు ముఖ్యమైన, అత్యవసరమైన పరిస్థితిలో (యుద్ధ సమయంలో) నీ రథాన్ని నేను మోయను అని శపిస్తున్నాను అని భూదేవి కర్ణుడిని శపిస్తుంది. అపుడు కర్ణుడు చిన్నగా నవ్వుతాడు. నేను నిన్ను శపించాను ఎందుకు నవ్వుతున్నావు అని భూదేవి కర్ణుడిని అడుగుతుంది. పేగుతెంచుకుని కడుపున పుట్టిన నా కన్న తల్లి నన్ను నదిలో వదిలేసింది, శిశ్యుడు విద్యలలో వీరుడైతే ఆనందించి అభినందించాల్సిన గురువు విద్యలు మర్చిపోతావు అని శపించాడు, నలుగురికీ వేదాలు బోదించే వేదపండితుడే అసలు విషయం వినకుండా అయిన వాళ్లందరికీ దూరం అవుతావని శపించాడు. అందరికన్నా ఓర్పు, సహనం ఉండే భూదేవి ఒక చిన్న తప్పుకే ఆవేశపడి శపించింది. ఏంటి నా ఈ జీవితం అని ఏడవలేక నవ్వుతున్నాను అని కర్ణుడు, భూదేవితో అన్నాడు. అది విన్న భూదేవికి కర్ణుడిని చూసి బాధనిపించింది. కానీ ఏమీ మాట్లాడకుండా మాయమైపోయింది. భూదేవి శపించేలా చేసింది ఇంద్రుడే.
అదే సమయంలో చాలా మంది జనం సంతోషంగా పరుగులు పెడుతూ ఒక ప్రదేశం దగ్గరికి వెళుతున్నారు. వాళ్లలో ఒకరిని ఆపి మీరంతా ఎక్కడికి వెళుతున్నారు అని కర్ణుడు అడిగితే కౌరవుల, పాండవుల యుద్ధ విద్యల ప్రదర్శన జరుగుతుంది అది చూడటానికే అంతా అక్కడికే వెళుతున్నారు అని చెప్తారు. ఆ సమయంలో భాదలో ఉన్న కర్ణుడు కూడా ఆ సభకి వెళ్లి భాదలో ఉన్న కర్ణుడు ఆవేశంలో అర్జునుడితో ఛాలెంజ్ చేశాడు. అపుడు ద్రోణాచార్యుడు కర్ణుడిని తక్కువ కులం(శూద్రుడు) అని కులం గురించి అవమానిస్తాడు. కర్ణుడిని అవమానపాలు కాకుండా చేసి దుర్యోధనుడు తన రాజ్యాన్ని కర్ణుడికి ఇస్తాడు. దాంతో అపుడు దుర్యోధనుడు కర్ణుడికి దేవుడిలా అనిపిస్తాడు. ఇక దుర్యోధనుడి మాటకి కట్టుబడి ఉంటాను అని కర్ణుడు తనలో తాను అనుకుంటాడు. మరుసటి రోజు కర్ణుడికి ఒక అనుమానం వస్తుంది. అది ఏమిటంటే దుర్యోధనుడు గొప్పదాత అని నేను ఎప్పుడు వినలేదు. ముక్కూ,మొహం తెలియని నాకు దుర్యోధనుడు ఇంత ధానం ఎందుకు చేశాడు అని కర్ణుడికి అనుమానం వచ్చింది.
దుర్యోధనుడు కర్ణుడికి ఇంతదానం ఎందుకు చేశాడో ఒక బటుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆ బటుడు కర్ణుడితో ఇలా చెప్పాడు, నీ కన్నా ముందు దుర్యోధనుడు ఏకలవ్యుడు అనే వేటగాడితో స్నేహం చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు గురు దక్షిణగా అడిగాడు. వేలు లేకపోవడంతో దుర్యోధనుడు ఏకలవ్యుడిని పట్టించుకోలేదు. ఆ తర్వాత దుర్యోధనుడికి నువ్వు దొరికావు అని కర్ణుడితో బటుడు చెప్పాడు. ఎటువంటి విద్య నేర్పించకుండానే ద్రోణాచార్యుడు బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు అని తెలిసుకున్నాక సాటి వీరుడుకి అన్యాయం జరిగింది అని కర్ణుడికి ఏకలవ్యుడి మీద జాలి కలుగుతుంది. ఒక వేటగాడికి ఆస్తులు, ధనం ఏమీ ఉండవు, వేటగాడికి ఉండే ఒకే ఒక్క గుణం వేటాడే గుణం. అలాంటి వేటగాడికి వేటాడే వీలు(వేలు) లేకుండా అయినందుకు కర్ణుడికి ఎంతగానో భాద కలిగి ఏకలవ్యుడికి ఇవ్వడానికి కర్ణుడు కొంత ధనం, బంగారం, తన కుటుంబానికి అవసరమయ్యే కొన్ని ఇతర సామాగ్రి తీసుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లాడు.
కర్ణుడిని చూసాక ఏకలవ్యుడు ఇలా అన్నాడు గురు దక్షిణగా నా వేలు కోసుకున్న తరువాత ఇప్పటి వరకూ ద్రోణాచార్యుడు గానీ, సాటి వీరుడిగా అర్జునుడు గానీ, మిత్రమా అని పలకరించి నన్ను పొగడల్తో ముంచెత్తిన దుర్యోధనుడు గానీ నాకు సహాయం చేయడానికి రాలేదు. కానీ నాకు నీకు ఏ సంబందం లేకపోయినా నాకు, నా కుటుంబానికి సహాయం చేయడానికి నువ్వు వచ్చావు నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది మిత్రమా అని ఏకలవ్యుడు కర్ణుడితో అన్నాడు. ఈ రోజు నుంచి ధర్మం అయినా, అధర్మం అయినా చావైనా, బ్రతుకైనా నీతోనే ఉంటాను, నీకోమే పోరాడుతాను, నీ కోసమే బ్రతుకుతాను, నీకోసమే మరణిస్తాను అని ఏకలవ్యుడు కర్ణుడికి మాట ఇస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com

చీకటి వేళ కావడంతో వేలాది మంది బటులు కాగడాలు పట్టుకొని దారిపొడవున నిల్చున్నారు. వేలాది కాగడాల వెలుగులో సూర్యుని కన్నా కాంతివంతంగా వెలిగిపోతున్న మొహంతో సంతోషంగా కర్ణుడు, పాండవులను జయించినంత గర్వంతో దుర్యోధనుడు రథంలో సభ నుండి అంతఃపురానికి భయలుదేరారు. వీరిని చూస్తూ సభలో ఉన్న కుంతీ మొహంలో సముద్రమంత విషాదం, ఆకాశమంతా ఆనందం ఒకేసారి కనిపించాయి. ఆ రోజు కుంతీకి కలిగిన బావోధ్వేగాలు ఇప్పటివరకి కూడా ఏ స్త్రీకి కలిగి ఉండవు. కర్ణుడు సభలో అడుగుపెట్టిన క్షణమే కర్ణుడి కవచకుండలాలు చూసి ఇతను నా కొడుకే అని కుంతీ గుర్తు పట్టింది.