ద్రోణాచార్య కోరిక తీర్చిన అర్జునుడు

‌మహాభారతం పార్ట్ 9

దుర్యోధనా మొన్న నువ్వు ద్రోణాచార్యుడిని వ్యతిరేఖించి కర్ణుడికి రాజ్యాధికారం ఇచ్చావు. ద్రోణాచార్యుడు చాలా శక్తివంతుడు. శక్తివంతులతో శత్రత్వం పెట్టుకోకూడదు. అతనితో ఎప్పటికైనా మనకు అవసరం రావచ్చు. వెళ్లు వెళ్లి సముదాయించు అని శకుని దుర్యోధనుడితో అన్నాడు. వెంటనే దుర్యోధనుడు వజ్రాలు, వైడూర్యాలు తీసుకొని ద్రోణాచార్యుడి ముందుకు వెళ్ళి గురువర్యా తీసుకోండి మా ఈ కానుకలు అని అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు నాకు ఇవేమీ వద్దు నేను చాలా అడిగింది ఇస్తారా అని అన్నాడు. అడగండి మీరు ఏది అడిగినా ఇస్తాము అని దుర్యోధనుడు అన్నాడు. అపుడు ద్రణాచార్యుడు తన గతం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఇపుడు పాంచాలి దేశాన్ని పరిపాలిస్తున్న ద్రుపదుడు మరియు నేను చిన్న వయసులో మంచి స్నేహితులం. కలిసి తినేవాళ్లం, కలిసి తిరిగే వాళ్లం, కలిసి ఉండేవాళ్లం.


 

ఇద్దరం కలిసి అస్త్ర విధ్యలు, శస్త్ర విధ్యలు నేర్చుకున్నాం. అపుడు(చిన్న వయసులో) ద్రపదుడు ఒక మాట అనేవాడు. మిత్రమా నేను పెద్దయ్యాక రాజును అయితే నా రాజ్యంలో సగభాగం  నీకు ఇస్తాను అనేవాడు. అలా ఇద్దరం స్నేహంగా ఉండేవాళ్లం. అలా కాలం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదృష్టం బాగుండి ద్రుపదుడు రాజయ్యాడు. కాలం కలిసిరాక నేను పేదవానిగా మిగిలిపోయాను. రోజు రోజుకి నా పేదరికం ఎక్కువయింది. దాంతో నా భార్య సలహా మేరకు ఒకరోజు ఏదైనా సహాయం అడుగుదామని నేను నా స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్లాను. నేను వెళ్లేసరికి ద్రుపదుడు చుట్టూ కొంంది స్త్రీలతో ముచ్చటలాడుతూ ఉన్నాడు. నేను వెళ్లి మిత్రమా నేను నీ చిన్ననాటి స్నేహితుడుడిని గుర్తుపట్టావా అని అన్నాను. దానికి ద్రపదుడు చాల్లేవయ్యా స్నేహితుడిని అని చెప్పి భిక్షం అడుక్కోడానికి వచ్చావా వెళ్లు వెళ్లు అని తన భటుల చేత బయటకి గెంటించివేసాడు.

అప్పటి నుండి ఆ అవమాన భారంతో బతుకున్నాను. అని తన గతాన్ని ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు చెప్పి మీరు నాకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే ఆ ద్రుపదుడిని తీసుకు వచ్చి నా కాళ్ల మీద పడెయండి అని ద్రోణాచార్యుడు అన్నాడు. అపుడు దుర్యోధనుడు అదెంత పని గురువు గారు. ఇపుడె వళ్లి ద్రుపదుడిని తీసుకు వచ్చి మీ కాళ్ల మీద పడేస్తాను అని చెప్పి దుర్యోధనుడుతో సహా వంద మంది కౌరవులు వెళ్లారు. కొంత సమయం తర్వాత కౌరవులు వట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఏమైంది అని ద్రోణాచార్యుడు అడిగాడు. గురువు గారు ఆ ద్రపదుడి సైన్యం చాలా పెద్దది, అతను చాలా శక్తివంతుడు. అతన్ని ఎవరూ ఏమీ చేయలేరూ అని దుర్యోధనుడు అన్నాడు.



వెంటనే పక్కనే ఉన్న అర్జునుడు గురువు గారు నేను వెళ్లి ఆ ద్రపదుడిని తీసుకువస్తా అని ద్రోణాచార్యుడితో అన్నాడు. నీతో పాటు ఎంతమంది సైన్యాన్ని తీసుకెళతావు అర్జునా అని ద్రోణాచార్యుడు అన్నాడు. అపుడు అర్జునుడు నాకు నీనే సైన్యం, నా బలం భీముడు అని చెప్పి భీముడిని తీసుకొని అర్జునుడు ద్రుపదుడి రాజ్యానికి భయలుదేరాడు. మరి అర్జునుడు వెళ్లి ఏమి చేసాడు... ఆ తరువాత ఏమి జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది.

 ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com

డియర్ సార్/మేడమ్ మీకు నా ఆర్టికల్స్ నచ్చితే Subscribe చేసుకోండి అని మనవి. Subscribe చేసుకుంటె నేను ఆర్టికల్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.