మహాభారతం పార్ట్ 7
నువ్వు ఎవరూ అని ధర్మరాజు ఏకలవ్యుడిని అడిగాడు. ఏకలవ్యుడు దానికి సమాధానం చెప్పకముందే నీ గురువు ఎవరు అని అర్జునుడు అడిగాడు. ఎందుకనగా ఒక్క క్షణంలో అన్ని బాణాలు వేయడం అది కూడా పరుగెడుతున్న జంతువు యొక్క అడుగుల శబ్ధం ఆధారంగా బాణాలు వేయడం ఎవరి వల్ల కాదు, అర్జునుడి వల్ల కూడా కాదు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏకలవ్యుడు నా గురువు గారు ద్రోణాచార్యుడు అని అన్నాడు. అపుడు షాకైన ద్రోణాచార్యుడు నేనా నీ గురువూ! అని ఆశ్చర్యంగా అడిగాడు. వెంటనే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి కాళ్లకి నమస్కరించి... గురువు గారు మీరు నా వద్దకు వచ్చారా అది నా అదృష్టం అని చెప్పి, గురువు గారూ మీకు గుర్తుందా కొన్ని సంవత్సరాల క్రితం నేను మీ దగ్గరకి విలు విద్య నేర్చుకోడానికి వచ్చాను. కానీ మీరు నేను క్షత్రియులకు మాత్రమే నేర్పిస్తాను నీకు నేర్పను అని నన్ను పంపించివేసారు. ఆరోజు నేను ఇంటికి వచ్చి మట్టితో మీ విగ్రహం తయారు చేసి ఆ విగ్రహం ముందు విలు విద్య సాధన చేసాను. ఇపుడు నేను విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాను. విలు విద్యలో ఎవరూ చేయలేని విన్యాసాలు నేను చేయగలను, కదులుతున్న వాటి పైన కూడా కేవలం శబ్ధం ఆధారంగా బాణం వేయగలను అని చెప్పాడు.
ఏకలవ్యుడు అలా చెప్పడంతో ద్రోణాచార్యుడికి మనసులో ఒక పక్క సంతోషం మరో పక్క భాద కలిగాయి. కేవలం నా విగ్రహం పెట్టుకొని నన్ను గురువుగా బావించి విలు విద్యలో ఇంత నైపుణ్యం సాధించినందుకు సంతోషం, అర్జునుడిని ఈ ప్రపంచంలోనే గొప్ప విల్లు కారున్ని చేస్తాను అని మాట ఇచ్చాను. కానీ ఏకలవ్యుడు ఖచ్చితంగా అర్జునుడి కంటే గొప్ప విల్లుకారుడు. కాబట్టి అర్జునుడికి ఇచ్చిన మాట నిలపెట్టుకోనందుకు భాద కలిగాయి. వెంటనే పక్కన ఉన్న దుర్యోధనుడు ఏకలవ్యుడు దగ్గరికి వచ్చి మిత్రమా ఏకలవ్య నీ అంతటి గొప్ప వీరున్ని ఎప్పుడూ చూడలేదు. ఎన్ని రాజ్యాలు తిరిగినా నీలాంటి గొప్ప వీరుడు దొరకడు అని పొగడ్తల్తో ముంచెత్తాడు. అంతేకాకుండా మా వంద మంది కౌరవులు నీకు అండగా ఉంటాము నీకు వజ్రాలు, వైడూర్యాలు ఇచ్చి సత్కరిస్తాము అని దుర్యోధనుడు అన్నాడు. ఏకలవ్యుడు దుర్యోధనుడితో స్నేహాన్ని ఒప్పుకున్నాడు. కౌరవులందరూ ఏకలవ్యుడి చుట్టూ చేరారు. ద్రోణాచార్యుడికి విషయం అర్థమయింది. అర్జునుడిని ఓడించేవాడు కౌరవులలో ఒక్కరు కూడా లేరు. ఏకలవ్యుడితో స్నేహం చేసి తమ వైపు ఉంచుకొని అర్జునుడిని ఓడించడానికి ఏకలవ్యుడిని సిద్ధం చేసుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఏకలవ్యుడు అర్జునుడిని సునాయసంగా ఓడించగలడు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే ఏదోకటి చేయాలి అని ద్రోణాచార్యుడు అనుకున్నాడు.
వెంటనే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడితో నేను నీ గురువుని అన్నావు కదా నాకు గురుదక్షిణగా ఏమి ఇస్తావు అని అడిగాడు. అపుడు ఏకలవ్యుడు నా దగ్గర పులి చర్మం, మాంసం, ఏనుగు దంతాలు తప్ప మీకు ఇవ్వదగింది ఏమీ లేదు గురువుగారు అన్నాడు. నువ్వు ఇవ్వదగినదే అడుగుతాను అని ద్రోణాచార్యుడు అంటాడు. అడగండి అని ఏకలవ్యుడు అంటాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి మొహం చూసి అడగలేక వెనకవైపు తిరిగి నీ కుడిచేతి బొటనవేలు ఇవ్వమని అడిగాడు. ఏకలవ్యుడు ఇస్తాడా ఇవ్వడా అని ద్రోణాచార్యుడు ఆలోచిస్తుండగా మిగతా వారందరూ నేలవైపు చూస్తున్నారు. అందరూ నేలవైపు ఎందుకు చూస్తున్నారో అని ద్రోణాచార్యుడు అటువైపు తిరిగి చూసాడు అక్కడ నేల పైన ఒక వేలు తెగిపడి ఉంది. ద్రోణాచార్యుడు అడిగిన మరు క్షణం ఏకలవ్యుడు తన బొటనవేలును కోసుకున్నాడు. ఏకలవ్యుడు ఇలా చేస్తాడు అని ద్రోణాచార్యుడు ఊహించలేదు. అర్జునుడి కళ్ల నుండి ఒక నీటి చుక్క కింద పడింది. ఒక గొప్ప వీరుడుకి ఇలా జరగడానికి కారణం నేనే అని అర్జునుడు బాధపడ్డాడు.
ఏకలవ్యుడు బొటనవేలు కోసుకోగానే దుర్యోధనుడి ప్రాణం ఒక్కసారిగా కలుక్కుమంది. తెగింది ఏకలవ్యుడి వేలు అయినా దుర్యోధనుడే ఎక్కువగా చింతించాడు. దొరక్క దొరక్క దొరికిన అవకాశం ద్రోణాచార్యుడి వలన మిస్ అయిపోయింది, మరోసారి ఇలాంటి అవకాశం వస్తే నా రాజ్యాన్ని ఇచ్చైనా సరే కాపాడుకోవాలి అని దుర్యోధనుడు అనుకున్నాడు. అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి ఆచార్య నాకోసమే మీరు ఇదంతా చేసారు కదా అని అన్నాడు. ధర్మం కోసం చేసాను అర్జునా అని చెప్పి ద్రోణాచార్యుడు వెళ్లిపోయాడు. ఆ రోజు అర్జునుడు ఒక చెట్టు కింద కూర్చొని భాదపడుతూ ఉన్నాడు. కొంతసేపటికి నకులసహదేవులు అర్జునుడి దగ్గరికి వచ్చి ఎందుకు అర్జునా ఇంతలా భాదపడుతున్నావు అని అడిగారు. ఏకలవ్యుడు వేలు తెగిపోవడం వల్ల నేను గొప్పవాన్ని అవడం జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఏకలవ్యుడి కన్నా గొప్పవాన్ని కాదు. ఏకలవ్యుడు లేనందున నేను గొప్పవాన్ని అవడం నాకు నచ్చడంలేదు. కాబట్టి నేను విలువిద్యలో ఏకలవ్యుడిని దాటాలి. అపుడే అతడికంటే గొప్పవాన్ని అవుతాను అంటాడు. శబ్ధం విని మాత్రమే కాదు చీకట్లో బాణం వేసే నైపుణ్యం సాదించాలి అని అర్జునుడు అనుకుంటాడు.
అనుకున్నట్టుగానే అర్జునుడు చీకట్లో కూడా బాణం వేయడం నేర్చుకున్నాడు. తరువాత అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి గురువుగారు ఏకలవ్యుడికి మీరు విద్య నేర్పకపోయినా కూడా గురుదక్షిణ అడిగారు. కానీ మాకు ఇన్ని విద్యలు నేర్పించారు. ఏ రోజు కూడా మమ్మల్ని గురుదక్షిణ అడగలేదు. మీరు ఏమి అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడి గుండెల మీద తన్నాడు. అలాగే అర్జునుడి ముందు ఒక కత్తి పడేసి ద్రోణాచార్యుడు ఒక కత్తి తీస్కొని నాతో యుద్ధం చేయ్ అని అర్జునుడితో అన్నాడు. అపుడు అర్జునుడు గురువుగారు మీరు మాకు గురువు మీరు నాకు దైవంతో సమానం మీతో యుద్ధమా... నేను ఎప్పుడూ అలా చేయలేను నా వల్ల కాదు అన్నాడు. నీ గుండెల మీద తన్ని యుద్ధానికి పిలిస్తే కత్తి దూయలేను అని అంటున్నావు. నువ్వేం వీరుడివి అర్జునా అని ద్రోణాచార్యుడు అంటాడు. ఏదో ఒకనాడు నీకు నాకు యుద్ధం జరిగే రోజు వస్తుంది. ఆరోజు నువ్వు ఒక వీరుడిలా, ద్రోణాచార్యుడి శిష్యుడిలా నాతో యుద్ధం చేసి నన్ను ఓడిస్తానని మాట ఇవ్వు అదే నేను నిన్ను అడిగే గురుదక్షిణ అని ద్రోణాచార్యుడు అన్నాడు.
కాసేపు ఆలోచించాక గురుదక్షిణగా అడిగాడు కాబట్టి సరేనని అర్జునుడు అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ద్రోణాచార్యుడి శిక్షణలో కౌరవులు, పాండవులు యుద్ధ విద్యల్లో ప్రావిణ్యులు అయ్యారు. హస్తినాపురం ప్రజలు వీరి యుద్ధ నైపుణ్యాలను చూడాలని కోరారు. దానికోసం యద్ధ విద్యలు ప్రదర్శించడానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసారు. మొదటగా ధర్మరాజు ఈటెలు ఎలా వేయాలో, ఎన్ని రకాలుగా వేయవచ్చో, యుద్ధరంగంలో రథాన్ని ఎలా నడుపచ్చో చూపించాడు. తర్వాత నకుల సహదేవులు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీల్లో తమ నైపుణ్యాలను చూపించారు. ఆ తర్వాత కౌరవుల్లో కొంతమంది తమ యుద్ధ విద్య నైపుణ్యాలు ప్రదర్శించారు. తరువాత తన విద్య చూపించమని దుర్యోధనుడిని పిలిచారు. వెంటనే దుర్యోధనుడు గద తీసుకొని చిన్నపుడు మల్లయుద్ధంలో నన్ను ఓడించావు. ఇపుడు మనిద్దరం పెద్దవాళ్లము అయ్యాము. ఇపుడు నాతో యుద్ధం చేయగలవా భీమా అని దుర్యోధనుడు అందరిముందు భీముడిని అడిగాడు. దాంతో భీముడు గద తీసుకొని దుర్యోధనుడి ముందుకు వెళ్ళాడు. ఇద్దరూ గదలతో కొట్టుకోవడం మొదలు పెట్టారు.
నాలుగు గంటలు గడిచింది అయినా కూడా ఇద్దరిలో ఎవరూ అలసిపోలేదు. వారి గదల శబ్ధాలకు సభంతా పిడుగులు పడినట్టగా దద్దరిల్లుతుంది. చూస్తున్న ప్రజలు దుర్యోధనుడు గెలుస్తాడని కొంతమంది, భీముడు గెలుస్తాడని కొంతమంది వారిలో వారు గొడవపడుతున్నారు. కొంతసేపటికి ప్రజలు కొట్టుకోవడం మొదలైంది. అది చూసిన ధుతరాష్ట్రునికి అర్థమయింది. ఎప్పటికైనా ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. కౌరవుల వైపు సగం మంది, పాండవుల వైపు సగం మంది ఉంటారు. దీని వల్ల రాజ్యానికి ఎప్పటికైనా నష్టం తప్పదని బావించి, వెంటనే ద్రోణాచార్యుడిని పిలిచి ఆచార్య ఇంతటితో ఈ పోరాటాన్ని ఆపించండి అని చెప్పాడు. వెంటనే ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని, భీముడిని ఆపి గద విద్యలో వీరిద్దరూ సమానులే ఒకరికి ఇంకొకరు ఏమాత్రం తీసిపోరు అని చెప్తాడు. తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడిని పిలిచి అర్జునా భీముడు, దుర్యోధనుడి పోరాటంతో సభ మొత్తం వేడెక్కిపోయింది. అందరూ ఆవేశంగా ఉన్నారు. నీ విద్యతో చల్లబరుచూ అని అన్నాడు.
సరే ఆచార్య అని చెప్పి అర్జునుడు సభ మద్యలోకి వెళ్లి ఆకాశంలోకి ఒక బాణం వేసాడు. వెంటనే నల్లని మేఘాలు అలుముకొని పెద్దవర్షం పడసాగింది. వెంటనే మరొక బాణం వేసాడు ఆ బాణం అగ్నిని పుట్టించింది. వర్షపు చినుకులు నేలని తాకకముందే ఆ అగ్ని వేడికి ఆవిరి అయిపోయాయి. మేఘాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఆకాశంలోకి మరొక బాణం వేసాడు వెంటనే వేలాది గులాబీ రేకలు పడి సభంతా ఎంతో అదంగా మారింది. మరల మరో నాలుగు బాణాలు తన చుట్టూ వేసుకున్నాడు వెంటనే భూమి నుండి పుట్టలు పుట్టలుగా పాములు బయటకి వచ్చాయి. సభలోని వారందరూ భయపడిపోయి అరవడం మొదలు పెట్టారు. వెంటనే మరొక బాణం వేసాడు ఆకాశంలో గద్దలు వచ్చి పాములన్నింటిని కాళ్లతో తీసుకెళ్లాయి. ఈ విద్యలు చూసి అందరూ శభాష్ అర్జునా అని అరుస్తున్నారు. ఆ అరుపులకు దుర్యోధనుడి తల వేడెక్కింది. ఇంతటి విలు విద్య ఉన్న వీరుడు నాకు తమ్ముడిగా ఎందుకు పుట్టలేదని భాదపడ్డాడు. అర్జునుడిని ఎదురించే మగాడు ఎవరూ లేరా, అంతటి మగాడు అసలు పుట్టలేదా, అలాంటి వీరుడు ఇక నాకు దొరకడా అని దుర్యోధనుడు మనసులో కుమిలిపోతున్నాడు.
ఇంతలో అర్జునా ఇక చాలించు నీ పిల్ల ప్రతాపం. దమ్ముంటే నాతో పోరాడు అని ఒక అరుపు వినిపించింది. ఆ అరుపు వినగానే దుర్యోధనుడికి పాల సముద్రంలో మునిగి తేలినంత హాయిగా అనిపించింది. హిమాలయా పర్వతాల్ని ఒక్క చేత్తో ఎత్తినంత ఆత్మవిశ్వాసం వచ్చింది. భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలను నేను ఒక్కడినే పాలించగలను అన్న దైర్యం వచ్చాయి. ఆ అరుపు ఎవరిదా అని చూస్తే, ఎదురుగా అత్యంత అందమైన యువకుడు, సూర్యుడి కన్నా కాంతివంతమైన చర్మంతో, స్పటికంలాంటి కవచకుండలాలతో, చేతిలోబాణంతో శివుడే.ధనుస్సు పట్టుకొని వచ్చాడా అన్నట్టుగా అనిపించే ఒక వ్యక్తి కనిపించాడు. అతడు ఎవరో కాదు అతడే మన "దాన వీర శూర కర్ణ". కర్ణుడిని చూడగానే దుర్యోధనుడు. వచ్చాడ్రా నా సైన్యం అని మనసులో ఆనందించాడు. అపుడు కర్ణుడు అర్జునా నువ్వు చేస్తుంది అస్త్ర విద్య కాదు గారడీ. గారడీకి అస్త్ర విద్యకు తేడా నీకు తెలియట్లేదు. రా నాతో పోరాడు నీకు అస్త్ర విద్య అంటే ఎంటో చూపిస్తా అని అంటాడు. ఈ ప్రపంచంలోనే 21 సార్లు భూమి మొత్తాన్ని చుట్టీ కనిపించిన శత్రువులందరినీ అంతమొందించిన ప్రపంచంలోనే అత్యంత వీరుడైనటువంటి పరశురాముడి శిష్యుడిని నేను. రా నాతో పోటీ పడు అని కర్ణుడు ఛాలెంజ్ చేసాడు.
వెంటనే ద్రోణాచార్యుడు లేచి నీది ఏ కులము అని అడిగాడు. శూద్రున్ని అని కర్ణుడు చెప్పాడు. శూద్రుడివా... అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటో నీకు తెలుసా..? క్షత్రియుల యుద్ధ విద్యల ప్రదర్శన. నీలాంటి శూద్రుడా మాకు సవాలు చేసేది. దేనికైనా సమవుజ్జి ఉండాలి. మా కల్లముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. పోరాడటానికి కావాల్సిన దైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది. పో పోయి నీ సాటి శూద్రులతో పోరాటం చేసుకో అని ద్రోణాచార్యుడు అన్నాడు. ఆ మాటలు వినగానే కర్ణుడికి ఇక నేను బ్రతకడమే దండగా అని అనిపించేంత భాద కలిగింది. అపుడు శకుని తన పక్కన ఉన్న దుర్యోధనుడి భుజం మీద చేయి వేసి దుర్యోధనా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం నీ ఎదురుగా నిలుచుంది. నీకు సమయం వచ్చింది ఇక లే అన్నాడు.
అపుడు దుర్యోధనుడు లేచి ఆచార్య జాతి వంకతో శూద్రునికి ఇక్కడ పోరాడే అర్హత లేదంటావా...
ఎంత మాట ఎంత మాట, ఇది వీరుల పరీక్షే గానీ వీరుల కుల పరీక్ష కాదే...
కాదు కాకూడదూ ఇది కుల పరీక్షయే అందువా...
నీ తండ్రి భరధ్వాజుడు ఎలా పుట్టాడు...?
అతిహీనమైన నీ పుట్టుక ఎలాంటిది...?
మట్టి కుండలో పుట్టావు కదయ్యా నీది ఏ కులమూ...?
అంతెందుకు కురువంశంలో పెద్దవాడైన మన భీష్ముడు సముద్రుని భార్య అయిన గంగ గర్భమున పుట్టలేదా ఆయనది ఏ కులమూ...?
నాతో ఎందుకు చెప్పిస్తావయ్యా...
మా వంశానికి మూల పురుషుడు అయిన వశిష్ఠుడు దేవతల వేశియ అయిన ఊర్వశికి పుట్టలేదా...
ఆ వశిష్ఠుడు పంచమ జాతి స్త్రీ అయిన అరుంధతితో శక్తినీ,
ఆ శక్తి చందాలంగినితో పరాసురుడిని, ఆ పరాసురుడు చేపలు పట్టే స్త్రీతో మా తాత వ్యాసున్ని కనలేదా...
వ్యాసుడు విధవ అయిన మా పితామహి అంబతో దృతరాష్ట్రున్ని,
పినపితామహి అంబాలికతో చిన్ననాన్నయిన పాండురాజుని,
మా ఇంటి పనిమనిషికి మీరందరూ ధర్మాన్ని నిలబెట్టడానికే పుట్టాడు అని ప్రశంసిస్తున్న ఈ విధురుడు పుట్టలేదా...
సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి సంక్రమైన కురువంశానికి ఎప్పుడో కులము లేకుండా పోయింది. అలాంటిది ఇపుడు ఇంకా కులమూ కులమూ అని పనికిమాలిన మాటలెందుకయ్యా... అయినా ఇక్కడ రాజ్యమున రాజుకు అర్హత ఉందంటే సస్యశ్యామలంతో, సిరిసంపదలతో వెలుగుతున్న మా అంగ రాజ్యాన్ని ఇప్పుడే కర్ణుడికి ఇస్తున్నా...
తమ్ముడూ దుశ్శాసన, వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని తొందరగా తీసుకురా...మామ గాంధార సార్వభౌమ, మణులు, రత్నాలు, వైడూర్యాలు పొదిగిన బంగారు సింహాసనాన్ని తొందరగా తీసుకురండి... విద్వాంసుల్లారా మోగించండి వాయిద్యాలు, భటులారా అలంకరించండి మన మందిరాన్ని... పుణ్య స్త్రీలారా కర్ణుడి నుదుటికి తిలకం దిద్దండి... ఈరోజు నుండి ఇప్పటికీ, ఎప్పటికీ కులం అనే మహమ్మారిని శాశ్వతంగా, సమూలంగా వేళ్లతో పాటు సమాధి చేస్తున్నాను అని అనుకుంటూ దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చి మిత్రమా నీకు నా అంగరాజ్యంతో పాటు నా సింహాసనంలో సగ భాగాన్ని కూడా ఇస్తున్నాను అని అన్నాడు. ఆ తరువాత ఏమిజరిగిందో, కర్ణుడు, ఏకలవ్యుడు ఎలా కలిసారో తరువాతి పార్ట్ లో ఉంటుంది.

ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com
డియర్ సార్/మేడమ్ మీకు నా ఆర్టికల్స్ నచ్చితే Subscribe చేసుకోండి అని మనవి. Subscribe చేసుకుంటె నేను ఆర్టికల్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.