మహాభారతం పార్ట్ 3
ఇంతకుముందు పార్ట్ లో... సత్యవతి భీష్ముడిని తన తమ్ముడి భార్యలతో సంగమించి పిల్లలను కనాలని చెప్పింది. దానికి భీష్ముడు తను వేసుకున్న భీష్మ ప్రతిజ్ఞ వలన సత్యవతి చెప్పినట్టు తన తమ్ముడి భార్యలతో సంఘమించడానికి ఒప్పుకోడు. అప్పుడు సత్యవతి తనకు పెళ్లికాకముందు పుట్టినటువంటి వ్యాసుడిని తీసుకురమ్మని భీష్ముడితో చెప్పి వ్యాసుడితో అంబిక, అంబాలిక లతో సంగమించి వారసులను ప్రసాదించమని చెప్తుంది. తల్లి కోరిక మేరకు తన తపోశక్తితో వ్యాసుడు అంబిక కడుపున ధృతరాష్ట్రుడు, అంబాలిక కడుపున పాండురాజు మరియు దాసి కడుపున విదురుడు లను ప్రసాదించాడు. భీష్ముడికి ఈ ముగ్గురు అంటే చాలా ఇష్టం, వీరికి అన్ని విద్యలు నేర్పించాడు... ఇంతవరకు ముందు పార్ట్ లో వివరించాను... తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం...
మహాభారతం పార్ట్ 3
భీష్ముడికి తెలియకుండా ధృతరాష్ట్రుడు, పాండు రాజుకు మధ్య కోల్డ్ వార్ జరిగేది. నేను గుడ్డివాడు అవడం వల్ల సింహాసనాన్ని ఎప్పటికైనా నా తమ్ముడే లాక్కుంటాడు అని ధృతరాష్ట్రుడికి అలాగే గుడ్డివాడు రాజవడం పాండురాజుకి ఇష్టం లేకపోవడం వల్ల పాండురాజుకీ, ఇద్దరి మనసుల్లో ఒకరంటే ఒకరు ద్వేషం పెంచుకున్నారు. వీల్లు పెద్దవాళ్ళు అయ్యారు. ముగ్గురిలో పెద్దవాడు అవడం వల్ల హక్కుగా ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం జరిగి హస్తినాపురానికి రాజయ్యాడు. పాండురాజు సేనాధిపతిగా ఉంటాడు. ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ రాజ్యాన్ని నడిపించేది మాత్రం పాండురాజే ఈ విషయం అందరికీ తెలిసిన రహస్యమే.
అదే సమయంలో హస్తినాపురానికి ప్రక్కన ఉన్న గాంధారి దేశంలో రాజ కుటుంబీకులు ప్రజలను పట్టి పీడిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని భీష్ముడికి తెలిసింది. "గాంధారి దేశం అంటే మన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్". భీష్ముడు గాంధారి దేశంపై యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి రాజ కుటుంబీకులలోని రాజుని మరియు అతని 100 మంది కుమారులని బంధించి బందీలుగా హస్తినాపురానికి తీసుకువచ్చాడు. యుద్ధం తరువాత యుద్ధ బందీలుగా బంధించిన వారిని చంపకూడదు, అలా అని భోజనం పెట్టకుండా ఉండరాదు. కానీ ప్రజలను అంత చిత్రహింసలకు గురిచేసిన వారు బ్రతకకూడదని భీష్ముడు అనుకున్నాడు.
ఆ 101 మందిని ఒక పెద్ద భావి లాంటి కారాగారంలో పెట్టి మీకు రోజుకు ఒక్కొక్కరికి ఒక్కో అన్నం మెతుకు మాత్రమే ఇస్తాను ఆకలితో చావండి అని భీష్ముడు అన్నాడు. అప్పుడు గాంధారి దేశ రాజైన శబల భీష్ముడితో నేను నా కుమారులు 101 మంది ఉన్నాము నువ్వు పెట్టే 101 మెతుకులు మాకు సరిపోక మేము కుంగి కృశించి చనిపోతాము. కానీ మాలో ఎవడైతే చివరిగా మిగిలిపోతాడో వాడిని మాత్రం దయచేసి చంపకుండా వదిలేయండి ఎందుకంటే వాడి కళ్ళ ముందు 99 మంది సోదరులు, తండ్రి మరణించడం చూశాక వాడు మరల తప్పు చేయడు. దయచేసి మాలో చివరి వాణ్ని మాత్రం వదిలేయండి అని భీష్ముడిని శబల శరణు కోరుకున్నాడు. దానికి సరే అని భీష్ముడు ఒప్పుకున్నాడు. భీష్ముడు చేసిన పెద్ద తప్పు అదే ఆ ఒక్క మాట వల్లే మహాభారతంలోని కురుక్షేత్రం యుద్ధం జరగడానికి కారణం అయ్యింది.
ఎట్టి పరిస్థితుల్లో శత్రువు పై జాలి జాలి చూపకూడదనే నియమం భీష్ముడు ఉల్లంఘించాడు. ఆ ఆరోజు రాత్రి సమయం అయింది ఆ 101 మంది బందీలకు సైనికులు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు చొప్పున 101 మెతుకులు అన్నం పెట్టారు. అప్పుడు శబల తన కుమారులను దగ్గరికి పిలిచి కుమారులారా మనము ప్రజలను హింసించామని అంతకన్నా ఘోరంగా మనల్ని ఆకలికి అలమటించేలా చేసి చంపాలని భీష్ముడు అనుకుంటున్నాడు. కానీ మనలో మిగిలిన చివరి వానిని వదిలేస్తానని భీష్ముడు అన్నాడు. మనలో మిగిలే చివరివాడు అత్యంత తెలివైన వాడై ఉండాలి. వాడే భీష్ముని కుటుంబాన్ని, రాజ్యాన్ని సర్వ నాశనం చేయాలి. మనం ఆకలితో చనిపోవాలని కోరుకున్న వాడి కుటుంబంలో ఎవ్వరికి అన్నం సహించకూడదు, చరిత్రలో ఎవరు పడనన్ని కష్టాలు వారు పడాలి. అలా చేయడానికి దేహ బలం సరిపోదు ఎందుకంటే భీష్ముడిని మనం కండబలంతో ఓడించలేము కేవలం బుద్ధిబలంతో మాత్రమే ఓడించగలము.
కాబట్టి ఈరోజు మీ వందమందికి ఒక పరీక్ష పెడతాను దాంట్లో నెగ్గిన వాడికి ఈ 101 మెతుకులు అన్నం భోజనంగా ఇస్తాను. వాడు తప్ప మిగిలిన వారందరూ ప్రాణత్యాగానికి సిద్ధమవ్వాలి అని శబల అన్నాడు. ఇప్పుడు మన అందరి దగ్గర ఒక్కో మెతుకు ఉంది, ఎవరైతే అన్నం మెతుకు రెండు ముక్కలు అవ్వకుండా అందులోంచి దారాన్ని తీస్తారో వాడిని తెలివైన వాడిగా గుర్తించి ఈ అన్నం అంతా పెడతాను అని అన్నాడు. అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ అందరి మెతుకులు విరిగిపోతున్నాయి.
వారందరిలోకి చిన్నవాడు ఒకడు ఉన్నాడు. అతను ఒక గొట్టంలాంటి సన్నని చీపురుపుల్లని తీసుకొని ఆ గొట్టానికి పైన ఒక వైపు అన్నం మెతుకు పెట్టి మరోవైపు ఒక చీమ కాలుకి దారం కట్టి ఆ గొట్టంలోకి పంపి ఇవతల వైపున వేళుతో మూసాడు. ఇక చీమకి మరో దారి లేక ఆ గొట్టానికి మరో వైపున ఉన్న అన్నం మెతుకుకి కన్నం చేసి దానిలో నుండి వెళ్ళింది. అలా అన్నం మెతుకు ముక్కలవకుండా దారాన్ని దాని మధ్యలో నుండి తీసి చూపించాడు ఆ చిన్నవాడు. ఆ చిన్నవాడు ఎవరో కాదు "శకుని". ఇక శబల ఆనందానికి అవధుల్లేవు, వీడు మాత్రమే మా వంద మంది పగని తీర్చగలడు అని అనుకొని అందరి మెతుకులు కలెక్ట్ చేసి ఆ ముద్దని శకుని నోట్లో పెట్టాడు.
శకుని అత్యంత జ్ఞాని. ఒక మనిషిని చూడగానే అతనిలోని బలాలు, బలహీనతలు పసిగట్టగలగుతాడు. తన నెమ్మదైన మాటలతో ఎవరినైనా మార్చగలడు. కొన్ని వారాల్లోనే ఒకరి తర్వాత ఒకరు తన 99 మంది మంది సోదరులు చనిపోయారు. చివరగా తండ్రైన శబల మరియు కొడుకైన శకుని మాత్రమే మిగిలారు. అప్పుడు శబల శకునితో కుమార మన కళ్ళముందే మనవాళ్ళు 99మంది చనిపోయారు. ఇక రేపో మాపో నేను కూడా చనిపోతాను. మా అందరి చావుకు కారణమైన వాడెవడు జీవించకూడదు. ఇక చివరగా మిగిలేది నువ్వే కానీ కాలం ఎలాంటి గాయాన్నైనా మానిపోయేలాగా చేస్తుంది. మన అందరి పగని నువ్వు రాజ్యానికి వెళ్ళాక నీకు దక్కే సుఖసంతోషాల వల్ల మర్చిపోవచ్చు, అప్పుడు మా అందరి చావుకి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని దగ్గరికి వెళ్లి మోకాలు దగ్గర వెనక్కి అని శబల శకుని యొక్క కాలు విరిచేశాడు.
అప్పుడు బాధతో శకుని అరుస్తుంటే ఈ బాధ ఇప్పుడే కాదు నేను నీ కాలుని విరిచేయడం వల్ల నీవు ఇప్పుడు అవిటి వాడివి, కుంటుకుంటూ నడుస్తావు. ఇకపైన నువ్వు కుంటుకుంటూ వేసే ప్రతి అడుగులోనూ మన పగ నీకు గుర్తుకు రావాలి అని శబల శకునితో అన్నాడు. ఈ రోజు నేను కూడా చనిపోతాను నేను చనిపోయాక నా కుడి తొడ లోని ఎముకను తీసి దాన్ని రాయి మీద రుద్ది వాటితో పాచికలు చేయి ఆ పాచికలలో నా శక్తి ఉంటుంది. నువ్వు ఏ సంఖ్య పడాలి అంటే అదే సంఖ్య నీకు పడుతుంది. ఆ పాచికలు నీ మాట వింటాయి అని చెప్పి శబల చనిపోయాడు. శకుని తన తండ్రి చనిపోయాక తన తండ్రి ఎముకని రాయి పై రుద్దుతూ ఆలోచనలు మొదలుపెట్టాడు. వెంటనే ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది, అవకాశం వచ్చేవరకు ఎదురు చూస్తాను అవకాశం వచ్చాక మాత్రం పక్కనే ఉంటూ పథకం ప్రకారం కొంచెం కొంచెం విషం ఎక్కిస్తూ రాజ్యాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాడు.
ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు చివరివాడైన శకునిని వదిలేశాడు. కానీ గాంధారి దేశంతో వైరం ఉండకూడదు అది ఎప్పటికైనా ప్రమాదమే అని భీష్ముడు అనుకున్నాడు. దానికి ఒకటే మార్గం అని మరల కొన్ని నెలల తర్వాత గాంధారి దేశం వెళ్లి శకుని చెల్లెలు ఆయిన గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు భీష్ముడు. అప్పుడు గాంధారిని ముందు కూర్చోబెట్టి అమ్మా గాంధారి, మా రాజ్యానికి రాజయిన ధృతరాష్ట్రుడు చాలా శక్తిమంతుడు, నీతిమంతుడు అని దృతరాష్ట్రుని గురించి ఎన్నో విషయాలు గొప్పగా చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కానీ అతను గుడ్డి వాడు అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు శకునికి కోపం వచ్చి, మంచి విషయాలన్నీ ముందుగా చెప్పి గుడివాడని చివరగా చెప్తావా. ఒక గుడ్డివానిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మా చెల్లికి లేదని భీష్ముడితో శకుని అన్నాడు.
వెంటనే గాంధారి లేచి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కాసేపటికి తలుపు తెరిచింది. అప్పుడు ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఆమె కళ్ళకి గంతలు కట్టుకుంది. ఏంటమ్మా ఇది అని శకుని అడుగితే, అన్నా నీకు కాబోయే భర్త ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని భీష్ముడు చెప్తున్నప్పుడే నేను అతన్ని నా భర్తగా ఊహించుకున్నాను. అతను గుడ్డివాడని చెప్పక ముందే అతనే నా భర్త అని నేను నిర్ణయించుకున్నాను. అంతటి గొప్ప వాడికి చూపు లేకపోవడం అనేది ఒక చిన్న లోపం మాత్రమే. ఏ లోపం లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరు. నా భర్తకి కనిపించని లోకం నాకు వద్దని అందుకే కళ్ళకి గంతలు కట్టుకున్నానని చెప్తుంది. ఇది అతనిపై నాకున్న ప్రేమకు చిహ్నం అని చెప్పి గాంధారీ భీష్ముడితో హస్తినాపురానికి బయలుదేరింది అప్పటినుండి గాంధారి కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి.
శకుని పగ ఇంకా ఎక్కువైపోయింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ దృతరాష్ట్రునికి గాంధారికి పెళ్లైపోయింది. అలాగే పాండురాజుకి కుంతి మరియు మాధురిలతో పెళ్లయింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి విహారయాత్ర కోసం అడవుల్లో మధురమైన ప్రదేశం దగ్గర నివసించడానికి వెళ్లారు.
ఆ తర్వాత పాండవులు, కౌరవులు ఎలా జన్మించారు... కౌరవులకు, పాండవులకు మధ్య మొదట చిన్న యుద్ధం ఎలా మొదలయ్యింది... ఆ చిన్న యుద్ధం కురుక్షేత్రానికి ఏ విధంగా దారితీసిందో నెక్స్ట్ పార్ట్ లో వివరిస్తాను.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com
దయచేసి పైన ఉన్న Subscribe పైన క్లిక్ చేసి Subscribe అవ్వ గలరని మనవి. థాంక్యూ వెరీ మచ్ సర్/మేమ్.