మహాభారతం పార్ట్ 1
పూర్వం వేదాలు అన్ని ఒకటిగానే ఉండేవి. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అని పిలిచేవారు.
పూర్వం వేదాలు అన్ని ఒకటిగానే ఉండేవి. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అని పిలిచేవారు.
వేదాలు విభజించిన తరువాత వ్యాసుడు ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతుంటే తన మైండ్ కి ఏదో గోరం జరుగబోతుందనే కొన్ని విజువల్స్ వచ్చాయి. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఆ విజువల్స్ తనని చాలా డిస్టర్బ్ చేశాయి. ఏం జరగబోతుందో చూద్దామని ఆయన తపస్సు లో కూర్చొని, భవిష్యత్తులోకి వెళ్లి, తనకు వచ్చిన విజువల్స్ యొక్క టైం లైన్ లోకి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆయన ఒక యుద్ధ భూమి మధ్యలో ఉన్నాడు.
ఎటుచూసినా కత్తుల శబ్దాలు, ఆకాశం నిండా బాణాలు, నేలంతా రక్తంతో నిండి పోయింది. అసలు ఏంటో ఇది అని చూద్దామని ఆకాశంలో మేఘాల వరకు వెళ్లి చూసాడు. ఆయన చూసిన దృశ్యం మరణం అంటే ఇదేనా అని అనిపించేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ జరిగే యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అని అనుకున్నాడు. తను చూస్తున్న కనుచూపు మేర అంతా యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధ సైన్యం ఎలా ఉందంటే నాలుగు లక్షల ఏనుగులు, ఐదు లక్షల రధాలు, 12 లక్షల గుర్రాలు, 22 లక్షల సైనికులు ఉన్నారు.
ఆ యుద్ధం ముగిసేసరికి మానవ జాతి మొత్తం అంతరించిపోతుందా అనేంత ఘోరంగా ఉంది ఆ యుద్ధం. దానికి మించిన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుని యొక్క వారసుల వల్ల. నేను బ్రహ్మచారిని కదా నాకు వారసులు ఏంటి అని ఆశ్చర్య పోయాడు వ్యాసుడు.
అసలు ఏం జరుగుతుందో వివరంగా అంతా రాయాలని వ్యాసుడు అనుకున్నాడు. అదీ ఆ కథ జరగక ముందే. కానీ నేను భవిష్యత్తులో ఉంటూ మొత్తం వీక్షించిన తర్వాత అదే కథని యాస్ ఇట్ ఈస్ గా నేను తరువాత రాయలేను కాబట్టి నేను చెప్పినప్పుడే నా ఎక్స్పీరియన్స్ నన్నింటిని ప్యారలల్ గా రాయలి అంటే నేను చెప్తున్నది వేరే వాళ్ళు రాయాలి. కానీ అంతటి సమర్థుడు ఎవరున్నారు అని చూస్తే ముల్లోకాల్లో అంతటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఒక్కరే కనిపించారు. ఆయనే విఘ్నేశ్వరుడు (లార్డ్ గణేష్). వెంటనే వ్యాసుడు తన తపోశక్తితో విఘ్నేశ్వరుని పిలిచి గణేషా నేను ఇప్పుడు కాలంతో ప్రయాణించి భవిష్యత్ లోకి వెళ్లి అక్కడ జరిగే ప్రతి సన్నివేశం చాలా వివరంగా నేను మీకు చెప్తాను. నా మైండ్ భవిష్యత్తు లో ఉన్నా, నా శరీరం ఇక్కడే ఉంటుంది. కాబట్టి నా నోటితో అక్కడ జరిగే విషయాలన్నింటిని నేను సాక్షి గా చూస్తూ మీకు చెప్తాను. నాకు అక్కడి వారందరూ కనిపిస్తారు నేను మాత్రం ఎవరికీ కనిపించను. నేను చెప్పేది చెప్పింది చెప్పినట్టు అక్షర రూపంలో మీరు రాయాలి అని అడిగాడు. గణేషుడికి ఉన్న స్పెషల్ సామర్థ్యం ఏంటంటే మన నోటి మాట ఎంత వేగంగా ఉంటుందో అంతే వేగంగా ఆయన రాయగలుగుతాడు. అందుకనే వ్యాసుడు ఆయనను సెలెక్ట్ చేసుకున్నాడు.
అయితే వ్యాసుడు మహాభారతం రాసే సమయానికి నిజానికి మహాభారతం జరగలేదు. ఆయన జరుగబోయే కథను రాశాడు.
వ్యాసుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఈ కథ ప్రదీప మహారాజుతో మొదలవుతుంది అని అన్నాడు. అప్పుడు గణేషుడు ప్రదీప మహారాజు మీ తాత కదా అంటే నువ్వు కూడా ఈ కథలో ఉంటావా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు గణేశా నేను చెప్పింది మాత్రమే మీరు రాయండి. దయచేసి ఎలాంటి సందేహాలు నన్ను అడగవద్దు అని అన్నాడు.
వ్యాసుడు గణేశునికి కథ చెప్పడం స్టార్ట్ చేసాడు, ప్రదీప మహారాజుకి ముగ్గురు మగ పిల్లలు పుట్టారు. పెద్ద వాడి పేరు దేవాపి, రెండోవాడు బహ్లీక, మూడోవాడు శాంతనుడు. దేవాపికి రాజ్యం పైన, ధనం పైన, అధికారం పైన మోహం లేదు. ప్రశాంతమైన జీవితం గడపడానికి చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళి పోయాడు. అక్కడ ఆయనకి అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది. అదే శంభాల నగరం, కలియుగం అంతంలో కల్కి అవతారం వచ్చేది శంభాల నుండే. అయితే దేవాపికి కూడా మరణం లేదు, కలియుగం అంతంవరకు ఆయన బతికే ఉంటాడు. ఇక రెండో కొడుకు బహ్లీక, తను తన చిన్నప్పుడే రాజ్యం వదిలి తన మేనమామ రాజ్యంలో పెరిగాడు. ఇక చివరిగా మిగిలింది చిన్నవాడు, ముఖ్యమైనవాడు శాంతనుడు.
ప్రదీపుడు ఒకరోజు ఒక నదీ తీరాన మెడిటేషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉండే గంగా అనే స్త్రీ ప్రదీపుడుని చూసి చాలా ఇష్టపడుతుంది. ప్రదీపుడి విశాలమైన బాహువులు, తేజస్సు చూసి ఆమె వచ్చి ప్రదీపుడి కుడి తొడ పైన కూర్చుంటుంది. ప్రదీపుడు కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సుందరమైన స్త్రీ తన తొడపై కూర్చొని ఉండటం గమనించాడు. అప్పుడు గంగ, క్షత్రియా మీరు నాకు బాగా నచ్చారు నా కోరిక తీర్చండి అని అడిగింది. దానికి ప్రదీపుడు అమ్మ నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడ మీద కూర్చున్నావు. ప్రతి మగాడి ఎడమ తొడ స్థానం భార్యది, కుడితొడ స్థానం ఇంట్లో ఆడ సంతానంది అని అన్నాడు. కాబట్టి నువ్వు నా కూతురితో సమానం నేను నీ కోరిక తీర్చలేను అని అన్నాడు. చూడడానికి రాజులా ఉన్నావు ఒక స్త్రీ వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చడం ధర్మం, నువ్వు ధర్మం తప్పుతావా అంటుంది. అప్పుడు ప్రథీపుడు చూడమ్మా నా రూపంతోనే నాకన్నా సుందర వంతుడు నా కొడుకు శాంతనుడు ఉన్నాడు. తనను నీ వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు శాంతనుడు గంగను కలిసాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆమె అందానికి దాసోహమై నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నేను ఏం చేసినా నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించరాదు, నువ్వు నాకు అడ్డు చెప్పినా, ప్రశ్నించినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి శాంతనుడు సరే అని మాట ఇచ్చి గంగను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తరువాత వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక మొగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను గంగ తన చేతుల్లోకి తీసుకొని ఎంతో మురిసి పోతూ, ఆడిస్తూ నదీతీరానికి తీసుకొచ్చి బిడ్డను నదిలో విసిరేస్తుంది. పక్కనే ఉన్న శాంతనుడు షాక్ అయిపోయి నోటి నుండి మాటరాలేదు. పట్టలేనంత కోపం వచ్చింది మన బిడ్డని ఎందుకని నదిలోకి విసిరేసి చంపేసావు అని అడుగుదామని అనుకున్నాడు. కానీ తనకు ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాడు. మరో బిడ్డ పుట్టాడు అలాగే చంపేసింది. ఇలా ఏడుగురు పిల్లల్ని చంపేసింది. శాంతనుడు ఏమీ చేయలేక మనసులోనే బాధపడుతూ ఉన్నాడు.
తర్వాత ఎనిమిదవ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డను కూడా అలాగే చంపేయాలనుకుంది. ఇక కోపం ఆపుకోలేక ఈ బిడ్డను కూడా చంపేయటానికి నేను ఒప్పుకోను, నేను రాజుని నా రాజ్యానికి వారసుడు కావాలి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగా, ఈ ఎనిమిది మంది పిల్లలు పూర్వజన్మలో 8 వసువులు. వీరు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వీరికి వషిష్ఠుడు శాపమిచ్చాడు. మానవుల లాగా పుట్టి మరణిస్తే వీరికి మోక్షం వస్తుంది. అందుకే ఇలా చేసాను అని చెప్పింది. అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి ఈరోజు నుంచి నేను నిన్ను వదిలేస్తున్నాను. అలాగే నువ్వు వద్దు అన్నావు కాబట్టి ఈ బిడ్డను (ఎనిమిదవ) నేను చంపను. పెంచి పెద్దయ్యాక తిరిగి నీ వద్దకే పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయింది.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో వివరించాను.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com
డియర్ సర్/మేడమ్ దయచేసి subscribe మీద క్లలిక్ చేసి subscribe చేసుకోగలరు.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో వివరించాను.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com
డియర్ సర్/మేడమ్ దయచేసి subscribe మీద క్లలిక్ చేసి subscribe చేసుకోగలరు.