అర్జునుడు భీముడిని తీసుకొని ద్రుపదుడి దగ్గరకి బయలుదేరాడు. వీరి రాకను గమనించిన ద్రుపదుడు తన సైన్యంలోని కొంత భాగంతో ఎదురు చూస్తున్నాడు. భీముడు, అర్జునుడు అక్కడికి చేరుకున్నారు. అక్కడ రెండు వందల గుర్రాలు, మూడు వందల ఏనుగులు, ఐదు వందల సైన్యం ఉంది. అర్జునుడు,భీముడిని చూసిన ద్రపదుడు వీళ్లు ఏమి చేస్తారో చూద్దామనుకొని వెనుక నిలబడ్డాడు. ఇపుడు నీ ప్లాన్ ఏంటి అని భీముడు అర్జునుడిని అడిగాడు. నువ్వు ఇక్కడున్న ఏనుగులను అంతం చేయి నేను నీ దగ్గరకు వచ్చే సైనికులను నా బాణాలతో నీ దగ్గరికి కూడా రాకుండా చూసుకుంటాను అని అర్జునుడు భీముడితో అన్నాడు.

ఇక భీముడు గద పట్టుకొని పరుగెత్తుకుంటూ వెళ్లి దూకి మదమెక్కిన ఏనుగు తల మీద గదతో ఒక్క దెబ్బ కొట్టాడు. వెంటనే ఏనుగు కింద కుప్ప కూలిపోయింది. సైనికులు భీముడి మీదకు వస్తుంటే అర్జునుడు తన బాణాలతో వారిని మట్టుపెడుతూ భీముడికి దారి ఏర్పరుస్తున్నాడు. భీముడు విజృంభిస్తూ ఏనుగులన్నింటినీ ఒక్కదెబ్బతో చంపుతున్నాడు. ఇదంతా చూసిన ద్రుపదుడు ముందుకు వచ్చి భాణాలు వేయసాగాడు. ద్రుపదుడు అస్త్ర విద్యలో ఆరితేరినవాడు.
ద్రుపదుడు బాణం వేసి అర్జునుడి విల్లును విరగొట్టేసాడు. ఇక అర్జునుడు, ద్రుపదుడు ద్వంద యుద్ధం మొదలు పెట్టారు. కొంత సేపటి తర్వాత కౌరవులు ఆశ్చర్యంతో లేచి నిలబడి చూస్తున్నారు. ఎందుకనగా దూరంగా అర్జునుడు ద్రుపదుడిని వెంట్రుకలు పట్టుకుని ఈడ్చుకొని వస్తున్నాడు. వెనకాల భీముడు గర్వంగా నడుచుకుంటూ వస్తున్నాడు. అర్జునుడు ద్రపదుడిని తీసుకు వచ్చి ద్రోణాచార్యుడి కాళ్ల మీద పడేసాడు.
నన్ను క్షమించు మిత్రమా, నన్ను ప్రాణాలతో వదిలేయ్ నీకు రాజ్యం మొత్తం ఇస్తాను అని ద్రుపదుడు ద్రోణాచార్యుడిని వేడుకున్నాడు. నేనే ఒక పేద బ్రాహ్మనుడిని నేను నీ ప్రాణాలనేం కాపాడగలను అని ద్రోణాచార్యుడు గర్వంగా అన్నాడు. నీకు నా రాజ్యం మొత్తం ఇస్తాను. నన్ను వదిలేయ్ అని ద్రుపదుడు ఏడవసాగాడు. మిత్రమా నువ్వు చేసిన తప్పును నీకు తెలిసేలా చేయడానికే ఇలా చేసాను. అంతేకానీ నీ ప్రాణం కోసమో, నీ రాజ్యం కోసమో కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇక వెళ్లు నీ రాజ్యాన్ని పాలించుకో అని ద్రోణాచార్యుడు అన్నాడు. ద్రుపదుడు వెళ్లిపోయాడు.
ద్రోణాచార్యుడు అర్జునుడిని దగ్గరకి తీసుకుని అర్జునా ఇన్నాళ్ల నుంచీ నా మనసులోని అవమాన భారాన్ని నువ్వు పోగొట్టావు నాకు ఇపుడు సంతోషంగా ఉంది అని ద్రోణాచార్యుడు అర్జునుడితో అన్నాడు. అంతేకాకుండా ద్రోణాచార్యుడు బ్రహ్మశిరాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. బ్రహ్మశిరాస్త్రం చాలా శక్తివంతమైంది. పూర్వం ఇది రాముడి దగ్గర ఉండేది. కానీ రాముడు ఈ అస్త్రాన్ని రావణుడి మీదనో రావణుడి సైన్యం మీద కూడా ఉపయోగించలేదు. అంటే నువ్వే అర్థం చేసుకో ఈ అస్త్రం ఎంత శక్తివంతమైనదో. ఎంతో అపద సమయంలో మాత్రమే నువ్వు ఈ అస్త్రాన్ని ఉపయోగించాలి అని మాట తీసుకొని ద్రోణాచార్యుడు బ్రహ్మశిరాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు.
ఇదంతా చూసిన దుర్యోధనుడుకి మళ్లీ భయం మొదలైంది. తన ముందే తన శత్రవు శక్తి పెరిగిపోతుంటే దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఈ విషయం దుర్యోధనుడు వెళ్లి శకునితో చెప్పాడు. అపుడు శకుని దుర్యోధనా శత్రువు బలపడుతున్నపుడే ధర్మమో, అధర్మమో వారిని మనం నాశనం చేయాలి. అంతేకాని శత్రువు పూర్తిగా బలవంతుడు అయ్యే వరకు వేచి చూడకూడదు అని అన్నాడు. దుర్యోధనుడు దృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ నాన్న ఇన్ని రోజులు పాండవులు అడవిలోనే ఉన్నారు కాబట్టి ఇక హస్తానాపురానికి నేనే రాజుని అనుకునే వాన్ని. కానీ ఇపుడు అందరూ ధర్మరాజు రాజవుతాడు అంటున్నారు. నువ్వూ ధర్మరాజునే రాజుని చేస్తావా... నేను రాజుగా పనికిరానా, రాజయ్యే లక్షణాలు నాకు లేవా నాన్న అని అన్నాడు. అపుడు దృతరాష్ట్రుడు రాజయ్యే లక్షణాలు లేక కాదు నీకు కాలం కలిసి రాక ఇలా భాదపడాల్సి వస్తుంది. నేను తొందరపడి పాండవులను చంపేసి నిన్ను రాజును చేస్తే ప్రజలు మన చరిత్రను చాలా హీనంగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి పని జరగాలి కానీ మన చేతులకి మట్టి అంటకూడదు. నేను ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను ఎప్పటికైనా హస్తినాపురానికి నువ్వే రాజువి అని ధృతరాష్ట్రుడు దుర్యధనుడితో అన్నాడు.
ఇక దుర్యోధనుడికి సంతోషం వేసింది. తండ్రి కూడా నావైపే ఉన్నాడని ఆనందించాడు. నాన్న ఇక్కడే ఉంటే పాండవులను మనమేం చేయలేము కొన్ని రోజులు వారిని ఎక్కడికైనా పంపించివేయి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని దుర్యోధనుడు అన్నాడు. మరుసటి రోజు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి ధర్మరాజ నువ్వు రేపు రాజువి కావాల్సినవాడివి. రాజుకి ఉండాల్సిన మొదటి లక్షణం ప్రజల సమస్యలు తీర్చడం. కనుక నువ్వు కొన్ని రోజులు ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల గురించి తెలుసో అని అన్నాడు.
కొన్ని రోజులు అయితే వారణాసిలో "మహాశివోత్సవం" జరుగుతుంది. "మహాశివోత్సవం" తరువాత నీకు పట్టాభిషేకం చేస్తాను అప్పటి వరకు మీరు వారణాసిలో ఉండండి అని దృతరాష్ట్రుడు దర్మరాజుతో అన్నాడు. దానికి ధర్మరాజు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ధర్మరాజు తన తల్లి, తమ్ముల్లను తీసుకొని వారణాసి బయలుదేరాడు. అపుడు విదురుడు పాండవుల దగ్గరికి వచ్చి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజ ఒక ఎలుక పిల్లి నుండి తప్పించుకోగలదు. పులి నుండి కూడా తప్పించుకోగలదు. ఏనుగు నుండి కూడా అది తప్పించుకోగలదు. కానీ దాని గూడు చుట్టూ నిప్పుపెడితే మాత్రం అది తప్పించుకోలేదు. నిప్పు నుండి తప్పించుకోవడం చాలా కష్టం అని విదురుడు ధర్మరాజుతో అన్నాడు.
విదురుడు అలా ఎందుకు అన్నాడో పాండవులకు అర్దంకాలేదు. వీరు వెళ్లేసరికి పురోచనుడు అనే గృహనిర్మాణ నిపుణుడు వీరికోసం ఒక అందమైన ఇంటిని నిర్మించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, విధురుడు పాండవులతో అలా ఎందుకు అన్నాడో తరువాతి పార్ట్ లో ఉంటుంది.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com
డియర్ ఫ్రెండ్స్ దయచేసి Subscribe మీద క్లిక్ చేసి Subscribe చేసుకోండి. మీరు Subscribe చేసుకుంటే నేను ఆర్టికల్ పోస్ట్ చేయగానే మీకు Notification వస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి